పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, జూన్ 2014, శుక్రవారం

Achanta Hymavathy కవిత

! గృహిణీ మానసం -------------------------------- నా మగడు నాకేమొ ప్రత్యేక వ్యక్తి! నా బిడ్డలకతడు ఆప్యాయ శక్తి! అలవాట్లలో అతడు ఆదర్శ మూర్తి, నా వ్యాసంగానికతడు ప్రోత్సాహ స్ఫూర్తి. నా కన్నులకతడు అందాల మూర్తి! నా వెతలకు స్పందించి,తీర్చును ఆర్తి, తాననుసరించుచు సదా చెప్పును సూక్తి. ఒకరిని నొప్పించక, తానొవ్వని యుక్తి! అతడు కార్యాలయమున పొందెను కీర్తి. అతడు విద్యా- బుద్ధు లందు,ఉజ్వలదీప్తి! ఒకరిని ఆశ్రయించక నమ్మును స్వశక్తి- ఏనాడూ దరిజేరనియ్యడు విరక్తి! అనుయాయులకు అతడంటే భక్తి. మితృలకు అతడంటే ప్రేమానురక్తి! ఇతని సాహచర్యం నాకెంతో తృప్తి- ఇతని గురుత్వమున నేను పొందెదను ముక్తి.!!! ---------ఆచంట హైమవతి ఫిబ్రవరి-2012,తెలుగు తేజం-మాసపత్రిక లో ప్రచురితం.

by Achanta Hymavathy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UyZB9L

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి