పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, జూన్ 2014, శుక్రవారం

Jagadish Yamijala కవిత

చెట్టు పిల్లలు -------------------------- ఈ చెట్టు ఆకులు ఏ ఇంటి వాకిట్లోనూ తోరణాలు కాకుండా ఉండుగాక చిలకల్లారా లోపలి నుంచే తొలుచుకోచ్చే భ్రమరాల్లారా ఈ పండ్లను ఇప్పుడేమీ చెయ్యకండి.... ఈ మామిడి చెట్టులాగానే ఎదిగారు ఆ ఇద్దరు చిన్నారులు ఆకులను చించేసి మొగ్గలను చిదిమేసి దాని కొమ్మలలో ఉరి తీసి వేలాడేసే వరకు కాస్తంత పక్కకుజరిగి వినోదం చూడండి ఈ చెట్టు నీడ జాతుల రక్తం హింసాయుత శోకం ఆ చిన్నారి వెంట్రుకలను గోళ్ళను వారి వారి దుస్తులలో ఈ చెట్టులోనే ఉండనిచ్చి ప్రకృతికి ఓ విజ్ఞప్తి చేస్తాను ఈ చెట్టు కొండను చీల్చి ఆకాశమంత ఎత్తు ఎదగాలి ఒక వనదేవతలా..... ముఖం ఎర్రబడి జుత్తు చెదరి శాఖలైన గోళ్ళు పెరిగి చేయాలి నృత్యం --------------------------- తమిళంలో కవి పళనిభారతి అనుసృజన - యామిజాల జగదీశ్ 13.6.14 --------------------------------

by Jagadish Yamijala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v7wG9k

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి