పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, జూన్ 2014, శుక్రవారం

Swatee Sripada కవిత

కావలసి౦ది అన్నీ సవ్యంగానే అగుపిస్తున్నాయని అనుకుంటాను ఉదయపు వెలుగులూ ఊహల సొబగులూ ఇంటి ముందు కళ్ళు తెరుచుకు మడతలు విప్పుకునే వార్తా పత్రికలోని రుస రుసలూ రౌద్రాలూ శుభాశుభాల అశ్రుతర్పణ, ఆనంద హేల అక్కడక్కడా కాలుజారిన అహంకారాలూ చీమలై పారే అక్షరాల ప్రవాహం అన్నీ సవ్యంగానే అగుపిస్తున్నాయి. అయినా నీడకూ నీడకూ మధ్య ఏదో పొసగని చారిక మాటకూ మాటకూ మధ్య లేవనుకు౦టున్న చీలికలు ఇన్నాళ్ళూ మౌనమే మనిషికీ మనిషికీ మధ్య రెండు సముద్రాల నడుమ ఒక మహా అగాధమనుకున్నాను కానీ పొరలు లేకపోయినా చూపు మసక బారుతు౦ది ఎదురుగానే ఉన్నా కావాలనుకున్నది అద్దంలో నీడవుతుంది నిజానికీ నీడకూ మధ్య కొన్ని వెలుగు యుగాల దూరమైతే నీడకూ అద్దానికీ మధ్య కొలతకందని నిర్జీవత ఆకు నిండా అలుముకున్న హరిత ప్రపంచం అణువణువునా పులకరింతల అంతా ఒకటన్న సమైక్యతా ఆమోదం అయినా అణువుకూ అణువుకూ మధ్య అంతర్యుద్ధం లోలోపలి అమరికలలో అరమర అంతా యూనిఫామ్ తొడుక్కున్న స్కూల్ పిల్లల్లా ఒకేలా అనిపిస్తాయి అయినా అడుగడుగునా కొలతల కందని అంతరాలు అల లాగా విసిరిన ఒక ఎండ పొడ ధవళ దరహాసపు వెలుగనే అనిపిస్తుంది. తరచి తరచి నీటి చుక్కల భూతద్దాల్లో చూసాక కదా సగం సగం మిళితమైన సప్త వర్ణ సముచ్చయాల సమరం తెలిసేది చూసేందుకు కళ్ళూ వెలుగే కాదు కనిపించని ఉనికిని చదువుకునే ఒక సజీవ నదీ ప్రవాహమూ ఉండాలి ఏమీ లేదనుకున్న ఆకాశాన్ని హత్తుకున్నట్టు లేనితనం వెనక ఉనికిని ఎదకు అలదు కోవాలి అయితే కనిపించని ప్రపంచాన్ని చూసే చూపు కోసం గాలింపు కావాలి ఊపిరి నుండి ఊహల వరకూ

by Swatee Sripadafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SGpqmq

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి