పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, జూన్ 2014, శుక్రవారం

Jaya Reddy Boda కవిత

// జయ రెడ్డి బోడ // ఇంక సెలవ్ // ఓ తండ్రీ ఓ తల్లీ మమ్ము క్షమించు! విహార యాత్ర మాకు విజ్ఞ్యానమవుతుందని తీసుకునే చిత్రాలు మా బ్రతుకు దొంతరల్లో తీపి జ్ఞ్యాపకాలై మిగలాలని వెల్లామే కానీ ఇలా ఆ నీటి ప్రవాహమే మీ కన్నీరై మిగులుతుందని మేము ఊహించనేలేదు మేధావులమై మీ మది ఆనందంతో వెలిగించాల్సిన మేము అనుకోకుండానే ... భగవత్ శక్తికి లొంగి మా రూపాన్ని కోల్పోయి ప్రకృతిలో సేద దీరటానికి కనుమరుగయి పోయాం వద్దు ఏడవకండేడవకండి నా ప్రియ మాత పితా గురువులారా మళ్లీ వస్తాం ఎవరెస్ట్ ను అధిరోహించిన ఒక చెల్లి రూపులో ఒక తమ్ముని ఆకారంలో యువ శక్తులమై .... అచిరకాల మా ఆత్మ బంధువులైన మా ప్రియ మిత్రుల రూపంలో మీ చుట్టూ తిరుగాడుతూనే ఉంటాం మీ కడుపు తీపి చిరుగాలులమై మీ యెద తాకుతూనే ఉంటాం... ఇంక సెలవ్ (13-06-2014..ఎదిగొచ్చిన పిల్లలు విహార యాత్రలో విషాదమై మిగిలిన ఆ తల్లి దండ్రులకు కాస్తైనా ఓదార్పు కలగాలని.. ఆ ఆత్మలకు శాంతి కలగాలాని నివాళులు )

by Jaya Reddy Bodafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TQLUSW

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి