పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, జూన్ 2014, మంగళవారం

Satya Gopi కవిత

---------------------------{ప్రయత్నం చేశాను} /సత్య గోపి/ నీటి ప్రవాహాన్ని పక్కకు తోసి సులభంగానే వచ్చేశాను.. నా స్నేహితులెవరు కనపడలేదు ఆశ్చర్యపోయాను ఇప్పుడే కదా అందరం కలిసి ఆడుకున్నాం, కేరింతలు కొట్టాము...! మెల్లగా దిగులుగా నడుచుకుంటూ ఆ బండరాళ్లను దాటుతున్నా... ఒక తల్లి, గుండె పగిలి చిమ్మే కన్నీటిని ఆపడానికి కొంగుని నోట్లోకి కుక్కింది నాకర్థం కాలేదు వెళ్ళి "ఎందుకేడుస్తున్నారు" అని అడిగా సమాధానం రాకపోవడతో బాధేసింది... పక్కన నా స్నేహితుడి తమ్ముడిని అడిగా "ఎందుకు మీరంతా ఏడుస్తున్నారు" అని తను కూడా ఏం మాట్లడటంలేదు.. చుట్టు చూశా ఎవరో కొంతమంది నీటిలోకి దూకి వెతుకుతున్నారు.. మిగతా వారిని వదిలి నేనొక్కడినే వచ్చానని నాతో మాట్లాడ్డం లేదు అనుకున్నా... ఏడవకండి అని అతని చేతిని పట్టుకోబోయా అంతే ఒక్కసారి నా శరీరం నిప్పును తాకిన నీటి చుక్కలా వణికింది.. ఇది నిజమా కాదా అని నా చేతిపై గిల్లి చూసుకున్నా నాకెమీ తెలియటంలేదు ఏం చేయాలో ఎక్కడికెళ్ళాలో ఒక్కసారిగా గుండె కన్నీటితో తడిసిపోయింది మెదడుని యంత్రంలో వేసి తిప్పినట్టుగా... మరి నావాళ్లంతా ఏరి ఎక్కడికెళ్ళారు నా స్నేహితులు అని వెతికా పరిగెత్తుతూ నేను లేచిన చోటునుండి ఇంకాస్తా దూరం వెళ్లా.. వెతుకుతున్న వాళ్ళ చోటుకి చాలా దూరంలో మా వాళ్లంతా కొన ఊపిరి కొనలని పట్టుకుని వ్రేలాడుతున్నారు... వేగంగా వెళ్లి వారిని కాపాడుదామని చేయి అందించా ఇక్కడా నేను అందలేదు వారికి వారిని తాకలేకపోతున్నాను నిస్సత్తువ ఆవహించింది... భూమిలోకి కృంగినట్టుగా ఒక్కసారిగా ప్రపంచమంతా ఏకమైనంత కోపం వచ్చింది... ఏమిచేయలేక నిశ్శహాయుడిగా చేతగానివాడిలా రోజు మొత్తం వేచి చూశా వారేమో అక్కడే వెతుకుతున్నారు వీళ్ళు ఇక్కడున్నారు దేవుడా అని కూడా అనలేని ద్వేషం నాలో ఉబికింది... నిరాశగా వాళ్ళలాగే ఉండిపోయా... ఎంతసేపైనా ఎవ్వరూ రాలేదు కోపం క్రోధం భరించలేనంత బాధ అక్కడ వారిని అలా చూస్తూ నిలవలేకపోయా... పరిగెత్తుతూ వెళ్లి మళ్ళీ ఒకసారి నీళ్లలోకి దూకాను మునుపటి కంటే ఇప్పుడు ధైర్యంగా ఉన్నా చావటానికి... 10-06-2014

by Satya Gopifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uQbK6L

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి