పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, జూన్ 2014, మంగళవారం

Santosh Kumar K కవిత

||ఓ గంగమ్మా...|| ఓ గంగమ్మా... ఎందుకే అంత కోపం? మంచు నుండే పుట్టావుగా.. మరెక్కడా కనబడదే ఆ జాడ?? కిందటేడాది ఒక్కసారిగా వచ్చావు, ఊళ్లన్నింటిని ఊడ్చుకెలిపోయావు ప్రతేడు ఎంతోకొంత గిట్టుబాటు అవతుందిగా ఇంకా చల్లారవే.. ఎందుకే మనిషంటే అంత కచ్చి??? నీలో మునిగితే పుణ్యం మాట దేవుడెరుగు పొరపాటున తలుచుకుంటే ఎటు నుండి వస్తావో ఈసారి ఇంకెంతమందిని లాక్కెలతావో అనే గుబులు మిగిలి అంతుచిక్కట్లేదే నీ యవ్వారం!! ఇంకా ఆకలి తీరలేదా?? ఆడదానికి ఇంత ఆశ పనికిరాదు చెప్తున్నా!! ఇలా జనమంతా తిట్టిపోస్తున్నారని నువ్వు ఏడవకులే... నువ్వు మాత్రం ఏం చేస్తావ్.. నువ్వు మంచిదానివే.. నీ మనసూ మంచిదే.. గంగమ్మవి.. అంటే అమ్మవే.. అయితే నిన్ను నిన్నులా ఉండనివ్వడుగా మనిషి మారాజు...!! మారాజు అజాగ్రత్త శాస్త్ర పండితుడు ఏదో అడ్డుకట్టలా ఒక ఆనకట్టు కట్టాడు.. రోజుకోసారి కూత పెట్టి సాగానంపుతానన్నాడు.. నిజానికి శివునికే కష్టమైంది నీ ప్రవాహాన్ని కట్టడి చేయటానికి పాపం అన్నెం పున్నెం తెలియని లేత పక్షులు వాటికేం తెలుసు అమాంతం నువ్వు వస్తున్నావని మనిషి మారాజుకి అంటే అన్నీ తెలుసు.. విశ్వవిజేత కదా.. నీ మాటకి విలువెందుకిస్తాడు.. తెలియక ఇంటి నుండి నవ్వులతో ఆడుతూ పడుతూ గుంపుగా ప్రకృతి అందాలని అందుకోవాలని అప్పుడే వచ్చిన లేలేత రెక్కలతో అలా అలా ఎక్కడి నుండో ఎగిరోచ్చాయి ఆటలో మునిగి తేలాలని అనుకున్నాయి కానీ నీటిలో తెలుకోలేనంత లోతుకి దిగిపోయాయి... కారణం తెలిసే లోపే రెక్కలు విరిగాయి.. కన్నవాళ్ళ కోరికలు కొండెక్కాయి.. కొండ లోయల్లో కొట్టుకుపోయాయి.. కానరాని దూరాలు చేరుకున్నాయి.. ఓ మనిషి మారాజా... సల్లంగా ఉండయ్యా... ఎందరి ఉసురు పోసుకున్నా నీకు ఆయువు తీరదు ఎందుకనో.. నీ చుట్టూ ఉన్నోళ్ళని మింగేయి... నిన్ను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే!! అప్పుడప్పుడైనా బాధ్యతలు గుర్తుంచుకో... నీకు నువ్వు ఇష్టం లేకపోవచ్చు.. కానీ ఆ కూనల అమ్మా అయ్యలు ఏ పాపం చేసారు.. నీకు చెప్పినా... ఆ గోడకి చెప్పినా ఒకటే... మొద్దు బారిన ఈ మనిషి మారడు.. ఓ మిగిలిన కూనలారా... మీరు మాత్రం ఇలా మారకండి... మరో మారాజు అవకండి!!! (ఆ విద్యార్ధులలో కొందరైనా బతికుండాలనే ఆశతో రాసిన కన్నీటక్షరాలు ఈ వాక్యాలు) :( :'( #సంతోషహేలి 10JUN14

by Santosh Kumar K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tZ9l7f

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి