పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, జూన్ 2014, మంగళవారం

Chandrasekhar Vemulapally కవిత

చంద్రశేఖర్ వేములపల్లి || హృదయ స్పందనలను నమ్ము .... ప్రియా! || ఓ ప్రియా! ప్రియతమా!! నీకీ విషయం తెలుసా? ఏడేడుజన్మల బంధం, నీవు పుట్టింది .... నా కోసమే అని .... అంతరాంతరాల్లో అనిపిస్తూ ఉంది .... నేనే నీ గమ్యాన్ని అని ఆ విషయం నీకు ఖచ్చితంగా తెలియనంత మాత్రాన ప్రవాహానికి, అలలకు ఎదురీదడం తగదేమో .... అతిగా మదనపడి నీ హృదయానికి వదిలెయ్యి నీ భవితవ్యాన్ని దాన్నే నిర్ణయించనీ నీ భవిష్యత్తు నాకు తెలుసు .... అది నాతో ముడిపడి ఉందని నీ కళ్ళలోకి, నీ హృదయం కిటికీలోకి తొంగి చూసిన ప్రతిసారీ దేని కోసమో, ఏ ఆసరా కోసమో నీవు శొధిస్తున్నావని అనిపిస్తుంది. నీకు తెలుసా! నీవు నిలకడగానే ఉన్నావని హృదయాన్ని కట్టడి చెయ్యడం తగదని, భయపడి నీకు తెలియని దేని గురించో నీ హృదయాన్ని నమ్ము! నీ హృదయ స్పందనలను గమనించు! నీ కోసం స్వర్గద్వారాలు తెరుచుకుని ఉన్నాయి .... అవిగో! .... నిజం! నా ప్రేమ అనురాగం జల్లులు కురిసేందుకు .... సిద్దంగా ఎదురుచూస్తూ .... నేను చూడు .... హృదయం ఆలోచించదు. స్పందిస్తుంది. అబద్దం ఆడదు. కష్టాల్లోనూ తియ్యదనాన్నే యిస్తుంది. ..... నీవు నమ్మితే అది నిన్ను నా దగ్గరకే తీసుకొస్తుంది .... అందుకే హృదయాన్నే నమ్ము మార్గదర్శకం చేసేందుకు, మదిలో చెలరేగే భయాలను తీర్చుకునేందుకు మనసు పరితపిస్తే, ఎవరైనా తోడు కావాలి, ఉండాలనిపిస్తే నీకు అభ్యంతరం లేకపోతే నేను నీ కోసమే ఉన్నానిక్కడ .... నన్ను నమ్ము ఔనూ! మరో ఆలోచనెందుకు? .... ఏది సరైనదనిపిస్తే అదే చేసేస్తే పోలా? అలా అయితే .... నీ హృదయాన్ని విశ్వసించు చాలు. అది నీకు మార్గదర్శకత్వం చేస్తుంది .... వెలుగుదారిలో నిన్ను నడిపిస్తుంది. ఒప్పుకోవాలి అన్పించకపోయినా, నా మాటల్లో నిజముందని నీకూ తెలుసు నీ హృదయానికీ తెలుసు. ఆనందం ఆవేదన, నీ మంచి ఏమిటో .... మంచి చెడులు .... నీకు మంచే జరిగేది ఎలానో నీ హృదయానికి తెలుసు .... దాన్నే నీకు మార్గాన్ని, గమ్యాన్నీ చూపనీ సర్ధుకో .... సరైన మార్గం అదేనని అది నిన్ను నడిపించడమే న్యాయమని నీ హృదయాన్ని నమ్మడం అనుసరించడం నీకు తప్పనిసరి అవసరమని నన్ను చూడు .... ఓ ప్రియా! ప్రియతమా!! నా హృదయం నన్ను నీ వద్దకు ఎలా నడిపించిందో .... నిర్ణయించుకుని కాదు. ఆలోచనలతో మార్గాన్ని మార్చుకోగలనని చూడకు. అంతా ముందుంది నీ హృదయాన్ని అనుసరించడం కష్టమేం కాదు .... ఆనందమే ఎవరికైనా హృదయస్పందనల నీడలో నడక అమృతమయమే మరిచిపోకు మార్గదర్శిని గా నీ హృదయమే నీ నేస్తమని. పరిస్థితులు కలవరపెడుతున్నప్పుడు, ఏ వైపుకు కదలడమా అని సంశయం కలిగినప్పుడు పురోగమించేందుకు తోడు అవసరం. ఒంటరి కి మనసు నో హృదయాన్నో నమ్మాలి. .... హృదయాన్ని నమ్ము నీ చుట్టూ ఉన్న ప్రపంచం ముక్కలు ముక్కలౌతుంటే నమ్మకమే ఊపిరిగా కదిలేందుకు .... నీ హృదయాన్నే నమ్ము నీ హృదయస్పందనల దిశగా కదులు .... జీవితం వికసించి పరిమళిస్తుంది. తెలుసుకో! 10JUN2014

by Chandrasekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oGT7QS

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి