పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, జూన్ 2014, మంగళవారం

Karthik Kilaparthi కవిత

"హలో..!సారు.. సారు... మా అబ్బాయి దీపు..సారీ దీపక్ (కల్పిత పాత్ర)బానే ఉన్నాడు కదా..కొంచం చెప్పండి బాబు మాకు ఈడ కాలు సేతులు ఆడట్లేదు."అని ఘాడమైన శ్వాస తీసుకుంటు తల్లడిల్లిపోతుంది ఓ తల్లి హ్రుదయం ... "హలో..!సార్..మా అమ్మాయి లక్ష్మికి ఒక్క సారి ఫోన్ ఇవ్వండి సార్.. గొంతు విని రెండు రోజులయింది." అని పసి వాడిలా గుక్కపెట్టి ఏడుస్తూ కూతురు గొంతు కోసం ఎదురు చూస్తుంది ఓ తండ్రి హ్రుదయం.... "నాన్నా .. డాలి అక్క ఫోన్ కలవడం లేదు. భయంగా ఉంది నాన్న.. అని బెక్కు బెక్కుమని ఏడుస్తున్న ఓ చిన్న్నారి హ్రుదయాన్ని ’అక్కకేం కాదమ్మ’ అని దైర్యం చెప్తునే భయంతో వణుకుతుంది మరో తండ్రి హ్రుదయం.. ’టి.వి వార్తల్లో ఎవరో నునుగు మీసాల కుర్రాడి ఫోటొ చూసి కళ్ళజోడు సవరించుకుంటు "ఈ అబ్బాయి ఎవరో గాని అచ్చం మన చింటు లానే ఉన్నాడు కదా.."అని జాలిపడిన పదినిమషాలకే నిజంగా అక్కడ కనిపిస్తుంది తన మనవుడు చింటునే అని తెలిసాక మాట రాక మూగబోయింది ఓ ముసలి హ్రుదయం... "రేయ్ యెదవా ..టూర్ నుండి వచ్చోప్పుడు ఊపుకుంటు ఒట్టి చేతుల్తో వచ్చావనుకో .. తెలుసుగా ,నీ బాడీ లో ఏ పార్టు విరగ్గొడతానో నాకే తెలియదు రోయ్.." అని స్నేహితుడ్ని ట్రైన్ ఎక్కిస్తు అన్న మాటలు గుర్తుచేసుకుంటు ఏకదాటిగా ఎక్కెక్కి ఏడుస్తుంది ఓ స్నేహితుని హ్రుదయం... ఊహించు .. ఒక్కసారి ఊహించు.. వాళ్ళ స్దానంలో నువ్వుండి ఊహించు.. రొజులో నువ్వు కనురెప్పలు తెరవబడి ఉన్న 18 గంటల్లో నీ కనుచూపుమేరల్లో నీతో పాటే ఉండే నీ దోస్త్ గాడు ఇక రేపటి నుండి అసలు కనిపించకపోతే .." రోజు సరిగ్గా రాత్రి 7:30 కి స్టార్ ప్లస్ లో సీరియల్ చూసే టైంలోనే నిన్ను కొట్టి నీ దగ్గర నుండి రిమోట్ లాక్కొని, నీ ముందే స్పోర్ట్స్ చానల్ పెట్టుకొని చూసే నీ చిన్నన్నయ్య రేపటి నుండి నీతో గొడవపడడానికి వాడు ఉండకపోతే… రోజూ ఊరంతా తిరిగి బండిలో పెట్రోల్ మొత్తం అవగొట్టి రాత్రి కి మెల్లగా శబ్దం రాకుండా ఇంటి సందులో బండి పెట్టేసే తమ్ముడు, ఇక రేపటి నుండి వాడసలు ఇంటికే రాడని తెలిస్తే.. ఊహించు .. ఆ ఊహ ఎంత భయంకరంగా ఉందో కదా.. ఎంత బాదాకరంగా ఉందో కదా నరాలు చిట్లుపోయేలా అరవాలని ఉంది కదూ.. తలమీద చేతులు పెట్టి ఆ చేతి వేళ్ళ మద్య ఇరుక్కున్న జుత్తుని గట్టిగా లాక్కోవాలని ఉంది కదూ.. చేతి వేళ్ళ గోర్లు ,అర చేతి కి రక్తం వచ్చేలా గుచ్చుకునేటట్లు పిడికిలి ని బిగించాలని ఉంది కదూ.. ఆ బాధ వర్ణనాతీతం ... నాకు ఊహ తెలిసినప్పటి నుండి ..బహుసా మూడవ తరగతి అనుకుంటా .మా వెనకింటి అన్నయ్య చనిపోయినప్పటి నుండి నన్ను నా మనసుని కుదిపేస్తున్న ప్రశ్న ఒక్కటే.. ఎందుకు .. ఎందుకు . మనిషి ఎందుకు చనిపోవాలి జీవి కి ప్రాణ పరిమితి ఎందుకు పెట్టాడు ఆ దేవుడు.. ప్రాణి ని పుట్టించడం దేనికి ,అదే ప్రాణి ని మన నుండి దూరం చేయడం దేనికి .. ఎందుకు 24 ప్రాణాలు .. ఎవరో అసమర్ధుని నిర్లక్ష్యం వల్ల ఆ అమాయుకుల జీవితాలు ప్రక్రతి లోకి కొట్టుకుపోయాయి.. వాళ్ళు నీకు ఏం అన్యాయం చేసారు .. కనీసం వాళ్ళ పేర్లు కూడా మా మనుషులకి తెలియదు .కాని వాళ్ళు బ్రతకాలని కోరుకున్నాం నిన్ను అర్ధించాం ప్రార్దించాం.. అదే మానవత్వం కాని నీకేమయింది.. నీకు ఆ మాత్రo మానవత్వం కూడా లేదా .?. ఓ నువ్వు దేవుడివి కదా .. క్షమించు.. చెప్పు.. ఎందుకు స్రష్టిస్తావ్ ? ఎందుకు శిక్షీస్తావ్? పుట్టిన మనిషి గిట్టక తప్పదనే సాకులు చెప్పకు .. నాకు సమాధానం చెప్పు . 16 యేళ్లుగా నన్ను పీడుస్తున్న ప్రశ్నకి సమాధానం చెప్పు.. ఆ 24 అమాయకుల బలి దానాలకు సమాధానమివ్వు.. ఆ ప్రాణాల్ని ప్రాణంగా పెంచిన, ప్రేమించిన వాళ్ళ కి సమాధానమివ్వు... చెప్పు...............

by Karthik Kilaparthi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o8KlgK

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి