పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, ఏప్రిల్ 2014, గురువారం

Ravi Rangarao కవిత

డా. రావి రంగారావు (పాడు పడిన కారు) ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో ఎన్నో ఏళ్ల నుండి ఓ కారు పడివుంది అలాగే కదలకుండా... నడిపే డ్రైవరు నిర్వాకంవల్ల... దర్జాగా కూర్చొని శాసించే శక్తుల వల్ల... చిన్ని చిన్ని మరమ్మతులు వస్తే పట్టించుకోకపోవటంతో, ప్రయివేటు కారు మోజు పెరగటంతో... పడివుంది నిశ్చలంగా కారు తుప్పు పట్టిన నల్లని ఎముకల గూడులా... పనికిరాని దని పారేయరు, పాత ఇనప సామాను కొట్టుకు పడేయరు, పడివుంది ఆ కారు శవం- పైవాళ్ళెవరో వస్తే నిజాయితీకి ఆధారం ఆ కారట! పొద్దున్నే కళ్ళు తెరవగానే ప్రాంగణంలోని చెట్లు, మొక్కలు కారును చూసి కాసేపు రొజూ ఏడ్చి మళ్ళీ మామూలు పనుల్లో మునిగిపోతాయి, కారు శవాన్ని కన్నెత్తి కూడా చూడకుండా ప్రయివేటు ఏసి కారులో వచ్చే అయ్యగారి కోసం ఎంత కాలం గడుస్తున్నా ఎదురుచూస్తుంటాయి వెచ్చని సంపదలు... ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో పడివున్న ఆ కారును చూసినపుడల్లా నాకు గుర్తుకొచ్చేది మన దేశం, మన దేశంలో వర్ధిల్లుతున్న ప్రజాస్వామ్యం. 17-04-2014

by Ravi Rangarao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qNOCUs

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి