పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, ఏప్రిల్ 2014, గురువారం

John Hyde Kanumuri కవిత

రాత్రంతా వర్షం కురుస్తోంది ||John Hyde Kanumuri || వేకువనే తనువంతా అరగదీస్తూ వాకిలిని ఊడ్చిన చీపురును ఎవరు పలకరిస్తారిప్పుడు ఏదోమూల అలా స్తబ్దుగావుంది బురదనిండిన వాకిలిని చూసావా పాదానికి అంటకుండా అక్కడక్కడా వేసిన రాళ్ళపైనుండి అంగలువేస్తూ నడవడం గమనించావా! పొటమరించిన అంకురాలతో నునులేతపచ్చరంగు అలుముకొని శింగారించుకుని నారుమడులు, నాట్ల మధ్య ఆరేసిన పొలాల కలనేత ఊరు బురదవీధుల్లో నడిచెళ్ళిన పశువులమధ్య గిట్టలగుర్తులతో ఆవేదో, గేదేదో, ఎద్దేదో ఎటుగా వెళ్లిందో పసిగట్టడం నేర్చావా! పశువులను తోసుకుంటూ నీరునిండిన గుంతలను దాటుతూ సన్నగా కురిసే చినుకులకు పలక నెత్తినపెట్టి పరుగెట్టి బడి గిలకబావిని చేదుకున్న నీళ్ళో కడుకున్న కాళ్ళో గమనించావా! ఈ రాత్రంతా వర్షం కురియాలి గుమ్మపాల నురగలతో స్వచ్చతనేదోవెతుక్కుంటూ వాకిట నిలబడి నీకోసం పడవలను వదులుతాను! .......original......23.7.2013

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1meOawt

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి