పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, ఏప్రిల్ 2014, గురువారం

Sri Gajula కవిత

దొరల గడీల ద్వారాలు // గాజుల శ్రీధర్// 9849719609 దొరల గడీల ద్వారాలు తెరుచుకుంటున్నాయి ద్వారపాలకులారా బహుపరాక్! బహుపరాక్! అంగరక్షకులారా జయహో! జయహో! “ప్రగతి కాముకులారా” కరస్పర్శల తన్మయత్వంలో మునిగి తేలుదాం రండి! 1 రాజుగారి అంబారీ ఊరేగింపు సంబురాలకు ముసుగులు వీడి దిగంబరులమై దిసమొలల్తో పునీతులమవుదాం రండి! ఉరకలెత్తిన ఉస్మానియా నెత్తుటి ఆకాంక్షలకు సకలజనుల ఆత్మగౌరవ స్వప్నాలకు సూసైడ్ నోట్ సిద్దం చేద్దాం మంట రగిల్చిన మానుకోటకు సమాధి కడదాం "ఉధ్యమ ప్రారంభకుడను నేనే విజయాన్ని భుజానికెత్తుకుని ,పూలగుత్తి చేతబూని పోరాట ముగింపు గీతాన్ని ఆలపించిందీ నేనే " ‘అధినేత’ డిక్లరేషన్ కు తబ్బిబ్బై నాగేటి సాల్లల్లో నాటిన విత్తులు మొలకెత్తకుండా పిడికెడు విషం చల్లుదాం రియల్ /రీల్/కార్పోరేట్ /మైనింగ్ మాఫియాల మాయాజాలపు వలస పాలన కొనసాగింపుకు ముసుగులు వేద్దాం స్వయం పాలన నినాదం గొంతు చుట్టూ అనకొండాల పట్టుతో ఊపిరినీ నలిపేద్దాం ఐలమ్మ తల్లికి తరతరాల తల్లుల దుఃఖాన్ని కానుకగా ఇద్దాం నాయకమన్యుల వాగ్ధాటికి ముగ్ధులమై సమ్మోహనా శక్తికి సాగిలపడి సాష్టాంగ ప్రణామాలు చేద్దాం మన కలల నెలవంకల్ని గడీల వారసత్వపు గుంజలకు కట్టివేద్దాం పిడికిళ్ళు జతకట్టకుండా వేళ్ళ మధ్యనే బ్రహ్మ జెముడు ముళ్ళను నాటుదాం 2 దళిత/బి.సి ముఖ్యమంత్రి మైనారిటి దిప్యూటి సి.ఎం నవ/సామాజిక/బంగారు తెలంగాణ ఏదైనా ఏలిన వారి పాదాల చెంత పదిలం రాజ్యాధికారం ప్రజలదే అఖిలపక్ష శిఖరాగ్ర కూటమిలో కుదిరిన ఒప్పందం సకల జనులారా విస్తర్లు పట్టుకుని సహా పంక్తికి పయనం కట్టండి పెట్టుబడి ప్రాకారాల కాపలా పత్రికల ముఖాలపై అభినందనల అక్షరాలు చల్లి పరవశించి పోదాం 3 ఆధిపత్య మిన్నాగు పార్టీల/ కూటముల గేట్ల ముందర కుబుసం విడిచి వేయి తలలతో బుసకొడుతున్నది దొరల గడీల ద్వారాలు తెరుచుకుంటున్నాయి పదం పాటై గజ్జె కట్టాలే పల్లె బొడ్రాయికాడ పిడికిళ్ళు మొలవాలె గోలుకొండ కోట ముందు పీరీలు బోనమెత్తాలె దొరల గడీలల్ల దళితవాడలు వెలిసి నవతెలంగాణకు నాంది పలకాలె సబ్బండ జాతుల సింగిడి జనతెలంగాణకు జైకొట్టి కదలాలె పొడిచిన తొలిపొద్దు సముద్రానికి పురుడు పోసింది చిరు అలల కెరటాలకు స్వాగతం పలుకుదాం రండీ..... 31/03/2014

by Sri Gajula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j4YlRi

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి