పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, జూన్ 2014, సోమవారం

Yessaar Katta కవిత

సురెక || తెలుగు గజల్-12 .. పుడమితల్లికి కోపమెంతో ఎండిపోయిన కుంట చూసీ పల్లెతాలుపు కళ్ళమంటా గొడ్డు-కాపుల జంట చూసీ. .. కోతకొచ్చిన వరిచేనులొ ధాన్యమంతా నేలరాలితే రైతుగుండే మూగపోయే నీరుముంచిన పంట చూసీ. .. నేలవాలిన జొన్నపంటలో కంకిపైనే మొలకలొస్తే పేదబతుకు ఆగమాయే వానతెచ్చిన తంట చూసీ. .. వానజల్లుల కుండపోతలొ పూరిగుడిసెలు కూలిపోతే ఆకలమ్మకు కడుపుమండే గింజఉడకని వంట చూసీ. .. పూతకొచ్చిన పళ్ళతోటను గాలివానలు ఊడ్చిపెడ్తే కౌలుదారుకు కళ్ళుతిరిగే అప్పులెక్కలు ఇంట చూసీ. .. కూలీనాలికి పోదమన్నాకురిసెవానలో పనుల్లేక పల్లెతల్లీ తల్లడిల్లే వెతలబతుకులు వెంట చూసీ. .. బ్రతుకుసుధలు దేవులాడా ఊరునొదిలీ పోదమంటే అన్నదాతకు గుండెజారే గొడ్డుగాదము కంట చూసీ. .. (తెలుగు గజల్-12 * 09/06/2014)

by Yessaar Katta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TyiUzd

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి