పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, జూన్ 2014, సోమవారం

Lanka Kanaka Sudhakar కవిత

రహస్యాలు కొన్ని ఉప్పునీటి చుక్కలు- తెల్లమబ్బుతునకలై నింగిచెట్టు నుంచి నవ్వుజల్లులు కురిసే అమృత రహస్యం ధాన్యం గింజల్ని అన్నం మెతుకులుల్ని చేసే జీవరహస్యం కుండీలో ఉల్లిపాయతొక్కల్ని గులాబిరేకులుగా మార్చేసుగంధ రహస్యం. ఈ జీవామృత సౌగంధ రహస్య సమూహమే మనుషిని మనిషి గా వుంచే దైవ రహస్యం ఆ రహస్యమే బహుశాబ్రతుకురహదారిలో హృదయం మైలురాయి దగ్గర ప్రెమ పూల వనాల మనసు మైదానం విస్తరించినచోట మన ఆయుష్షుని పెంచే సుధాధారా సుమధుర పరిమళ పవనమౌతోంది దాన్నే మనమంతా........ ప్రేమంటూ వుంటాం...

by Lanka Kanaka Sudhakarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o5kCFY

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి