పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, జూన్ 2014, సోమవారం

Bvv Prasad కవిత

బివివి ప్రసాద్ || ఇందుకేనా || 1 నాలుగుగోడల మధ్య విసిరేసిన బంతిలా ఇక్కడిక్కడే తిరుగుతాయి నీ ఊహలు అదే ఉదయంలోకి మేలుకొంటూ, అదే రాత్రిలోకి నిద్రపోతూ ఒక్కరోజునే వందేళ్ళు బ్రతికి వెళ్ళిపోతావు ఇందుకేనా పుట్టింది, జీవితం ఇంత ఇరుకా అని అడుగుతుంటావు కనబడ్డవాళ్ళందరినీ ఒక్క మనిషిలాంటి వేలమనుషులు ఒక్క జవాబైనా ఇవ్వకుండానే వెళ్ళిపోతుంటారు ఈమాత్రానికి చీమైపుట్టినా సరిపోయేదికదా పూవైపుట్టినా మరింత బావుండేదికదా అని నిన్నునువ్వే నిలదీసుకొంటావు 2 రాలిపోతుంటాయి ఉదయాలూ, అస్తమయాలూ రాలిపోతుంటాయి వెన్నెలలూ, నక్షత్రాలూ రాలిపోతుంటాయి వానచినుకుల్లానో, ఎండుటాకుల్లానో రుతువులూ, కోరికలూ, బాంధవ్యాలూ జారిపోతున్న దిగులుదుప్పటిని ముఖమ్మీదికి లాక్కొంటూ ఇందుకేనా పుట్టిందని ఎవరిలోంచో ఎవరిలోకో అడుగుతూ వుంటావు నువ్వు కాస్త శాంతీ, చిరునవ్వూ మినహా మరేమీ వద్దని కాస్త ఊరటా, ధైర్యం కాక ఇంకేం కావాలని ఊరికే సుడి తిరినట్టు నీలోనువ్వే తిరుగుతుంటావు 3 చీకటి ఆకాశంలో నల్లని మేఘంలా దు:ఖం చిక్కబడినపుడు నీటిలోని సుడిగుండం లోతుల్లో నీరేమీ మిగలనపుడు పీడకలలాంటి వెలితిలోకి నీ ప్రశ్న నిన్ను విసిరేసినపుడు తటాలున ఉలికిపడి మేలుకొంటావు జవాబు దొరకదు కానీ, ప్రశ్న మాయమౌతుంది ఉదయాస్తమయాలూ, వెన్నెలలూ, రుతువులూ దిగుళ్ళూ, ఊహలూ, ప్రశ్నలూ అన్నిటికీ అర్థంవుందని, అర్థాలకి అందని ఖాళీ ఆనందాన్ని అవి ప్రకటిస్తూ, మాయమౌతూ వున్నాయని నీలోపల మేలుకొన్న సిద్ధార్ధుడు చెప్పగా వింటావు __________________________ ప్రచురణ: ఆంధ్రజ్యోతి వివిధ 9.6.2014 http://ift.tt/TyiUiB 9.6.2014

by Bvv Prasad



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TyiUiB

Posted by Katta

2 కామెంట్‌లు: