పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, జూన్ 2014, సోమవారం

Pardhasaradhi Vutukuru కవిత

!! యువత తరంగం ... తలుచుకుంటే !! యవ్వనం ఎంతో ఆహ్లాదకరం ప్రతి ఒక్కరికి ఏదో తెలియని ఆవేశం .. ఉత్సుకత స్నేహం అంటే తెలియని ఆరాటం గురువులు అంటే భక్తీ వున్నా ఏదో తెలియని కోపం అమ్మ నాన్న అంటే ప్రేమ కానీ కట్టడి చేస్తేనే తెలియని కసి ప్రతిదీ తెలుసుకోవాలి అనే ఉత్సాహం తెలుసుకున్నది అర్ధం చెసుకొగల్గె శక్తి ప్రోత్సహిస్తే ఏదైనా సాధించ గల సత్తా దీనికి ఒక సరియైన లక్ష్యం తోడయితే దానికోసం పట్టుదల తో కృషి చేస్తే ప్రతి యువకుడు దేశానికి పట్టుకొమ్మ కాగలడు సాంకేతికంగా ఎంతో ఎదిగిన ఈరోజుల్లో సాంకేతికత ను సద్వినియోగం చెసుకొగల్గితె అవకాశాలు వారినే వెతుక్కుంటూ రావా ?? నిరుద్యోగం అన్న పదం వినిపిస్తుందా ?? తమ శక్తి ని తాము తెలుసుకోలేని అభినవ మేధావులు ... నేటి యువకులు యువతా మేలుకో .. జాతిని మేల్కొలుపు ... !!పార్ధ !!9/6/14

by Pardhasaradhi Vutukuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ss14N7

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి