పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, జూన్ 2014, సోమవారం

Girija Nookala కవిత

నీ తో ప్రయాణం వాగులు, గుట్టలు ,కొండలు,కోనలు ఎన్నో మలుపులు ఇంకెన్నో తలపులు ఎంతో దారి మిగిలే వుంది,వేయని అడుగులను అడుగుతునే ఉంది. పెదవులు మాట్లాడుతునే ఉన్నా మనసు మౌనంగానే ఉంది కలసి నడుస్తున్నా కలవని దారి దూరం పెంచుతునే ఉంది అంతలోనే ప్రయాణం చెప్పకుండానే రద్దు చేసు కున్నావు. మళ్ళీ మజిలో నిన్ను గుర్తు పట్టగలనా? మౌన రాగంలోని రాగాన్ని పోల్చుకోగలవా? పొద్దు వాలిన ప్రయాణం ఉదయించేదెపుడో మనసు కోయిల గానం వినిపించేదెపుడో? చుట్టూ జనమే అయినా ప్రయాణం ఒంటరిదే కదా!

by Girija Nookalafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o67EYs

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి