పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, జూన్ 2014, సోమవారం

Pusyami Sagar కవిత

!!స్వగతం !! _____పుష్యమి సాగర్ ఆ రోడ్డు నలు దిక్కులను కలిపే వారధి ... ఎన్ని వేల చెమట చుక్కల పన్నీరు ను మట్టి లో కలుపుకొని చాపగా పర్చుకున్నదో మరి !!! ఇప్పుడంటే నల్లటి తారు ను దుప్పటి గా కప్పుకొని దర్జాగా కాలాలను తమ పై వర్షించుకుంటుంది కాని ఒకప్పుడు పచ్చని నందనవనాలకి ప్రతీకలు మొదలుకంటా నరకబడ్డ చెట్ల పునాదులపై నాగరికతని శాఖోప శాఖలు గా విస్తరించారు కదా!! ఎన్ని కొత్త జంటలు తమ కలలని చిదిమేసుకొని వాహనాలకు బలి అవ్వలేదు చెప్పు ...!! రేపటికి పునాదులవ్వాల్సిన విద్యార్ధులు నింగికెగసిన రాకెట్టు లా దూసుకెళ్ళి కోడగోట్టిన దీపం లా సగం లో నే తమ ప్రయాణం ముగించలేదు ....!! వాగ్దానాలలో చిందర వందర గా తమ బతుకులను ముక్కలు చేసుకుంటూ కూడా ఇప్పటికి ఎన్ని ఉళ్లు తమ రాక కోసం కళ్ళలో కాయలు కాసాయో ఎవరికైన తెలుసా ...!!! అభివృద్ధి అడవులను మింగేస్తూ కొత్త దారేదో మొలకేత్తినపుడు మనకు మరో అవకాశం లేదు .... పుట్టే దగ్గరనుంచి చచ్చే దాకా... చచ్చుకుంటూ ఆ దారంట వెళ్ళాల్సిందే !!!... జూన్ 9, 2014

by Pusyami Sagarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ss5S58

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి