పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, జూన్ 2014, సోమవారం

Lingareddy Kasula కవిత

ఈ రోజు ఆంధ్రభూమి లో నా ఇదుపుకాయితం మీద సమీక్ష సంఘర్షణల్లోంచి వచ్చిన 'ఇడుపు కాగితం' andhraprabha - Mon, 9 Jun 2014, IST Bookmark and Share Email Email Print Print దగాపడ్డ జనం గుండెల గోస కాసుల లింగారెడ్డి కలంలో సిరాగా మారుతుంది. అది ప్రచండమై ప్రళయఘోష వినిపిస్తుంది. అక్షరాలు అజేయమై ప్రవహిస్తాయి. కవిత్వాన్ని శక్తివంతంగా ఆవిష్కరిస్తాడు. పరుల దు:ఖాలను గుండెకెత్తుకొని కవిత్వ భాషను మనదగ్గరకు చేరుస్తాడు. లింగారెడ్డికి కవిత్వం సామాజిక అంశం. సమాజమే అతని కవిత్వంలో ప్రతిబింబిస్తుంది. ఉద్యమాలు, పోరాటాలు, కల్లోల సందర్భాలు అన్ని కవితా వస్తువులే. ఇటువంటివన్నీ డాపప కాసుల లింగారెడ్డి అందించిన నిుఇడుపు కాయితం్ణ్ణ కవితా సంపుటిలో కనిపిస్తాయి-- ఒక అసంపూర్తి వాక్యం గురించి/ నేనిప్పుడు మాట్లాడుతున్నా -/ భావాల్నే కాదు, భాషల్ని వక్రీకరించే వాడివి/ అసంపూర్తి వాక్యాల ఆత్మఘోష నీకేమెరుక/ అవును, చరిత్ర పుటల్లో మిగిలిపోయిన/ ఒక ఉద్విగ్న అసంపూర్ణ వాక్యం గురించే/ మళ్ళీ నేను మాట్లాడుతున్నా -అంటాడు లింగారెడ్డి- తెలంగాణ భాషను, యాసను హేళను చేయడం, సంస్కృతిని, చరిత్రను వక్రీకరించడం జరిగినదే. అది ఈ వాక్యాల్లో మనకు కనిపిస్తుంది. 28 జూన్‌ 2012న బీజాపూర్‌ జిల్లా బాసవాడ ఆదివాసీల మీద ప్రభుత్వ హత్యాకాండకు నిరసనగా రాసిన కవితలో ఇలా అంటాడాయన. గాయం చేసిన బుల్లెట్‌కు కాయం చిరునామా తెలవదు/ నువ్వు అభివర్ణిస్తున్న దేశ అంతర్గత నిశత్రువుదోా /అనాదిగా అడవినీ, అవనినీ/ నమ్ముకున్న ఆదివాసీదో/ కాయయెవ్వరిదన్నది కసిగా దిగిన బుల్లెట్‌కు/ తెలవదుగాక తెలవదు -ఎక్కుపెట్టిన తుపాకి కన్నుకు తెలుసు/ ఆ కన్నును తన కనుసన్నల్లో ఆడించుకునే రాజ్యానికి తెలుసు -ప్రభుత్వాల దమన కాండలు ప్రపంచవ్యాప్తంగా జరగడం చూస్తున్నదే. ఇటువంటి వాటిని నిరసిస్తూ బలమైన స్వరాన్ని వినిపిస్తాడు లింగారెడ్డి. ఒబామా!/ ఓ మై అన్‌డియర్‌ అమెరికన్‌/ తన మతమనే భ్రమలో / నా మైనారిటీ మిత్రుడు/ వర్ణం తనదనే వ్యామోహంలో/ నా దళిత కవి పుగవుడూ/ ప్రవృత్తి తనదనే తాదాత్మ్యంతో/ నా అనువాద కవి సహచరుడూ/ కవిత్వమై పరవశించి / నీకు కీర్తి కీరీటాన్ని తొడిగారు- అని చెపుతూ ఇదే కవితలో అమెరికా పాలకుల నైజాన్ని ఎత్తిచూపుతాడు. శ్వేతసౌధ సింహాసనం మీద కూచుంది/ నల్లత్రాచైనా, తెల్లత్రాచైనా/ విషం చిమ్ముతూనే వుంటుందని/ మన చికిత్స కొనసాగించాల్సి వుంటుందని తెలుసుకోలేకున్నారని అంటాడు. ఇది నిజం. అది అమెరికా పాలకుల నైజమే. దేశాలమీద కర్రపెత్తనం చేయడం అమెరికా పాలకులకు అలవాటైన విద్య -యుద్ధాల్ని సృష్టించడం, ఆయుధాల్ని విక్రయించడం. తన కిష్టం లేని వారిపై ఏదో ఒక నెపం పెట్టి హతమార్చడం అగ్రరాజ్యం అనుసరించే విధానం. ఇందులో ఎవరు పాలనలోకి వచ్చినా మార్పేమీ ఉండదని చరిత్ర చెప్పిన సత్యం. అదే నిక్రూర పరిహారం్ణ శీర్షికతో రాసిన కవితలో చూస్తాం. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలవారు పాల్గొన్నారనేది మనం చూసినదే దానికి అక్షర బద్ధఁ చేస్తూ ఇలా అంటాడు కవి నిుకాలం వసంతాల్ని కౌగిలించుకునే వేళ/ దూంధాం దరువులు కోడి కూతలైనవి/ జ్ఞానపు ఎన్నాద్రి కోసం/ అక్షరాల్ని ఇరువాలు దున్నే విద్యాలయాలు/ ఉద్యమ యుద్ధ భూములైనవి/ అన్యాయపు రాబందురెక్కల్ని/ నిత్యం వాదాల కరవాలాలతో నరికే నల్లకోటు/ పార్లమెంటు ముంగిట నిరసనల పిడికిళ్ళెత్తింది/ అంటుకుంటున్న దేహాల కొలుముల్లో/ సానపెట్టబడ్డ కలాల పాళీలను/ మత్తడివడ్డ గుండె చెరువులో ముంచి/ ఉద్యమ గీతాలల్లుతున్నారు. ఈ కవితంతా ఇలా సాగుతుంది. కాలం ఎవని కనుసన్నల్లో/ నడవదు/ ప్రాణం ఎవడి సేఫ్టీలాకరల్లో/ నిలవదు- ఉగ్రవాదం /ఏ మట్టి పొయ్యిమీద ఉడకదు/ సామూహిక హనన చర్య ఎవడో మీటనొక్కందే ప్రాణాలు ఎగురేసుకపోదు/ దారిద్య్రం దారిదోపిడీకి లైసెన్సుకాదు--- పంచభూతాలు/ ఎవడి పాదాక్రాంతమూ కావు/ ఎవడి పడకెక్కే / పసిడి కాంతులూ కావు/ నిబాంచెన్‌్ణ, కాల్మొక్కవు్ణ ---- ఒరేయ్‌ మూర్ఖుడా! / చుట్టబెట్టుకొని / ఉక్కులాకర్లలో భద్రపరుచుకునేది/ ఉట్టి కాగితపు ఉండలే/ జీవకోటి ప్రాణాధారపు భూమి కాదు -ఈ కవితాపాదాలు వరంగల్‌ జిల్లా బచ్చన్నపేటలో 2.9.2012 నాడు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు ఒకే రాత్రి పాముకాటుకు మరణించిన సందర్భంగా రాసినది. డాపప కాసుల లింగారెడ్డి ప్రతి సందర్భానికి స్పందించే గుణం నిండుగా ఉంది. సమకాలీన ప్రపంచపు రుగ్మతలపై, ఘోరాలపై మానవతా కోణంలో తనదైన ప్రత్యేక శైలిలో కవిత్వీకరించడం ఇందులోని ప్రతి కవితలో కనబడుతుంది. వాడికి/ పగిలిన అద్దానికి/ చాలా చిన్న భేదం మాత్రమే వుంది/ ఆవుపేడతో కళాఖండాల్ని సృ ష్టించే వాడికీ ఇసుక గడియారంలో ఏముందో తెలుస్తుంది/ పరాయీకరించబడ్డ మట్టివాసనలో / పొద్దుతిరుగుడు పువ్వు ల ధిక్కార స్వరంలో కలం విరజిమ్మిన అక్షరాల కరవాలాల మొనలమీద / కళ అమరత్వం పొందుతుందని వాడికి తెలుసు--- కాని/ ఇప్పుడు వాడు/ అస్తిత్వం కోసం ఆరాటపడుతున్నాడు -/ పోగొట్టుకున్న తనని తాను వెతుక్కుంటున్నాడు- /తానొక దళిత కవినని/ సగర్వంగా చాడుతున్నాడు. అని దళితం అస్తిత్వ పోరాటాన్ని భుజానికెత్తుకొని నడుస్తున్న దళిత కవుల పక్షాన నిలుస్తాడు. దళిత కవులు తాము దళిత కవులమని సగర్వంగా చాటుకుంటున్నారంటాడు. ఇటువంటి అస్తిత్వం కోసం నిమ్నవర్గాలు సాగిస్తున్న ఉద్యమాల్ని సమర్థించవలసి ఉంది. దాన్నే కాసుల లింగారెడ్డి చేస్తున్నాడు. మొత్తానికి ఆయన అందించిన నిఇడుపు కాగితం్ణ ఒక సామాజిక బాధ్యత కలిగిన కవిగా లింగారెడ్డిని నిలబెట్టిందని నికచ్ఛగా చెప్పవచ్చు. పేజీలు: 112, వెల: 100 రూపాయలు, ప్రతులకు: కాసుల లింగారెడ్డి, ప్లాట్‌ నెం: 63, ఇం.నెం.3.9.318/1, సరస్వతీనగర్‌, చింతలకుంట చెక్‌పోస్టు, ఎల్‌.బి.నగర్‌, హైదరాబాద్‌ -500 074. -నియోగి «మునపటి ఆర్టికల్

by Lingareddy Kasula



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TycsYP

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి