పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, జూన్ 2014, సోమవారం

Aravinda Raidu Devineni కవిత

అరవిందరాయుడు **************** గువ్వలా....... ******* ఆకాశంలో విహరిస్తూ ఓ గువ్వలబారు ప్రశాంతంగా మేఘాలలో మెరుస్తూ యధేచ్చగా వాయుకన్య కంఠహారంగా సాగుతూన్నాయి విశృంఖలమైనా వాటిపోకడలో ఎంత ఒద్దికో... ఓ మహాచిత్రకారుని కాన్వాస్ పై చిత్రంలా హృద్యంగాఅనిపిస్తున్నాయి ఒక్కోసారి ఒక్కోఆకారంలో అమరుతూ వివిధ విన్యాసాలతో చిత్రవిచిత్రంగా దృశ్యీకరమవుతున్నాయి గాలిపటంలా ఓసారి చేపపిల్లలా ఓ సారి నీటి కెరటంలా మరోసారి పూలదండలా ఇంకోసారి అలరిస్తూన్నాయి నాలో ఏ మూలో అసూయారేఖ తళుక్కుమంది ఈసారిమాత్రం నవ్వుతున్నపెదాలరూపంలో వాటిఅమరిక కన్పించి నన్నుకవ్వించింది మావలె..స్వేచ్ఛగా ఎగరగలవా అన్నట్టు... నామనసు ద్వారా వాదించాను బెట్టుగా విమానాలున్నాయిలే మాకంటూ.. అయినా నాలోనాకే సందేహం అంతస్వేచ్ఛయేది మళ్ళీదిగుతామా అనే దిగులో ఖర్చయిపోతుందన్న గుబులో వెంటాడుతూనే ఉంటుందికదా... ఇంకా బింకంతో వాదించింది మనసు ఊహల్లో ఎగిరేది మేమేనంటూ... నాలో మళ్ళీ అలజడి అమ్మో అంతసమయం ఎక్కడిదంటూ నామనసు అర్ధసారాంశాల్ని అర్థం చేసుకున్న ఆపెదాల చిత్రం వెక్కిరించింది గాయపడకుండా నేలమీద సరిగా పయనించలేరు మీరు అన్నట్టుగా. అంతే నాగర్వంసర్వం మంచంపట్టేసింది *********** 09-6-2014 (19) ీ

by Aravinda Raidu Devinenifrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pWQTPf

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి