పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, జూన్ 2014, సోమవారం

Sriramoju Haragopal కవిత

ఒప్పుదల రాత్రంతా నింపుకొన్న నిద్ర ఒక ఇంధనం బుర్రలో పదే పదే రాసుకొన్న కలలపద్దులు రెప్పలంటివున్న తడిని తుడిచే పంకాలయితయి చీకటికి ప్రతిరోజు వెలుగురంగులద్దే పొద్దులు ఏ గడ్డిగింజలో కడుపులోకి వొలికిపోతయి అంతరంగంలో అనంతమైన సాంత్వన ఎవరికొరకు నిలువని బాటసారి కాలంగిట్టలకు నాడాలు కొట్టేపని మనిషికి వూరూరికి గురువులుంటరు, అడిగే అక్కెర్లుంటయి వాన కొడితే కప్పుకోవడానికి జోరబొంత కొప్పెర్లుంటయి లోపల తడిసిపోయినంక మీదేం కప్పుకోవాలె నిండిపోయిన సోయి వున్నంత దనుక అంతరంగంలో అనంతమైన సాంత్వన జారుట్ల పాదాలకు పదును తెలిసినంత రేగట్ల నాగలికర్రుకు నొప్పి తెలిసినంత ఎరుకున్నోళ్ళకు ఎరుక తెలిసినంత మరుపుకు మరుపు తెలిసినంత అంతరంగంలో అనంతమైన సాంత్వన

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pWR2lN

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి