పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, ఫిబ్రవరి 2014, సోమవారం

Thilak Bommaraju కవిత

తిలక్/నేను కాని... 1.ఈరోజు నన్ను నేను కొత్తగా చూసుకుందామని ప్రయత్నించాను /ఎప్పుడో మరుగున పడిన చిరిగిన జ్ఞాపకాలుగా 2.నాలోకి దొర్లిన కొద్ది నాకు తెలియని నన్ను నాకు పరిచయం చేస్తున్నాయి నా అస్తిత్వాలు 3.ఇంతకుముందే కడిగేసుకున్న పళ్ళెంలా నీళ్ళు ఇంకని బావిలా నేను /రాలుతున్న కురుపుల గూళ్ళు ఒంటి వరండా నిండా 4.సరే కాసిని మిగిలిన కన్నీళ్ళతో ముఖమంతా కడుగుదామాని కూర్చుంటే /చేతుల వేర్లు(వేళ్ళు) పాతుకుంటున్నాయి బిగబట్టిన ఊభి కిరీటంలా నన్నే చుట్టుముడుతూ 5.ఇంక చాల్లేకదాని వాలుకుర్చీలో వెనక్కు వాలుతున్నాను /గతించిన గమనంలోకి వెక్కిళ్ళు తోడురాగా... తిలక్ బొమ్మరాజు 02.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fNo2ol

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి