పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, ఫిబ్రవరి 2014, సోమవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//అంతటా...// ఎంత దూరం పరుగెత్తావో చుట్టు పక్కలు విడిచి చుక్కాని వదిలేసి ఎన్ని తిరిగివచ్చావో కదూ... కాల గర్భంలో కలిసిపోయిన ముత్యాల హారం ఒక్క పూసైనా నీ గుండెల మెరిసిందా! తీరమే గమ్యమైన గమనంలో ప్రశాంతంగా మింగేసిన సుడిగుండం సంద్రపులోతు చూపించిందా! అరచేతిలో అక్కడక్కడా మిగిలిన ఇసుక రేణువుల్లాంటి ఆప్యాయతలని గుప్పిట వదిలినపుడైనా గమనించావా! ఈ తీరం ఆవలి తీరం నట్టనడుమ కన్నీటి సంద్రం మనిషే నడుస్తూ పరుగెడుతూ, మారుతూ, పారిపోతూ... నడకరాక పాకినప్పుడు పాదరక్షలతో నడిచినప్పుడు రెక్కలొచ్చి ఎగిరినప్పుడు అలిసిన వయసులో రాలినపుడు అడుగున అంతటా నేలే ప్రయాణానికి సహకరిస్తూ...మన్నే గమ్యం....02.02.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LDbWEX

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి