పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, ఫిబ్రవరి 2014, సోమవారం

Pusyami Sagar కవిత

!!ప్రవాహం!! _________పుష్యమి సాగర్ మాటలన్నీ కూడబలుక్కొని తరిమి కొట్టాయి దూరంగా ... రెక్కలు విప్పిన నా ఆలోచన ని ...!!!! పొద్దు లేచింది మొదలు సూరీడు ని భుజాన మోస్తూ పడి లేస్తూ పరిగెడుతున్నా కూడా మస్తిష్కం చుట్టూ సృజన మిణుగురులు ఎక్కడో ఆరిపోయిన భావుకత కి వెలుగు అవుదామని !!!! నా దాహం తీరనిది ఎన్ని ఒయాసిస్సుల వెంట నడిచినా కూనలమ్మ పాదాల కోసం వెతకడమే !! సంఘటన లు వెల్లువెత్తి వాన లా కురిసినపుడు ఇంకు చుక్కలు బుక్కులో రాతలువుతున్నయి ...రక్త సిక్తం గా నో ...విషాదకరం గానో ....!!! ప్రపంచం లో ఏ మూలన ఏది జరిగిన అక్షరం రివ్వున ఎగిరే పక్షి అవుతుంది . మాట వాహకమై బుల్లి పెట్టెల్లో మధ్యమము గా మారి అర చేతుల్లో రెప రెప లాడుతూ వుంటుంది .. అంతు లేని అనంత ..భావ ప్రవాహం ..!!! పిబ్రవరి 1, 2014

by Pusyami Sagar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bLChaf

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి