పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, ఫిబ్రవరి 2014, సోమవారం

Sriramoju Haragopal కవిత

లీడర్లు జిందాబాద్ ఇది ప్రభుత్వ స్మశానం దీన్ని అతిక్రమించినవారు శిక్షార్హులు ఎవరు దాటలేని చావుగోడలు కట్టించారు ఎవరికి సాటిలేని ఖర్మకాండలు రాసిపెట్టారు చచ్చేవరకు ప్రజల్ని బతకనీయరు వాళ్ళచేతనే వాళ్ళ శవాల్ని మోయిస్తారు చావుగంటలు మాత్రం రాజ్యాంగబద్ధంగా మ్రోగిస్తారు రాబోయే ఎన్నికలకు కొత్త ఎన్నికల సవరణలు ప్రజలంతా జీవితకాలానికి ఒక్కసారే ఓటేస్తే చాలని పార్లమెంటు నుండి అసెంబ్లీలదాకా సభ్యుల నుండి మంత్రులదాకా చట్టాల నుండి శాసనాలదాకా ఎన్నికైనా వారంతా అమరులేనని ఒక్కసారి ఓటేసి చచ్చినవారికి ఉచితం స్మశానప్రవేశం కావాలంటే ఓటర్లని వాళ్ళే పుట్టించుకుంటారట పనులు,జీతాలు,తిండి,ధరలు,సబ్సిడీలు సమానత్వం చట్టుబండలు, మానవత్వం మట్టిగడ్డలు దేశమంటే ప్రజలు కానేకారు దేశమంటే నాయకులోయ్ ప్రజలు కొత్త పుల్బాటిలు ఓటరులై మీరు బతికివున్నదాక ప్రజలుత్త వెధవాయిలు ఓదార్పులు మీరంతా చచ్చినాక రండి, రండి ఓటేసి చచ్చిన పర్మిషన్లున్నపుడే మీ మీ బొందలు మీకు రిజర్వుడ్ 01.02.2014

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kx2WgR

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి