పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, ఫిబ్రవరి 2014, సోమవారం

సిరి వడ్డే కవిత

ll నా వల్లకాదంటూ ll అంబరం నీలాన్ని వలదంటే హరివిల్లు వర్ణాలను వద్దంటే తారలు ప్రకాశాన్ని వదిలేస్తే జాబిలమ్మకు చల్లదనమే పడదంటే కూనలమ్మ స్వరాలనే వినిపించనంటే చిలుకమ్మ పలుకులను విడనాడితే మయూరం నర్తనాలను మరిచానంటే కలహంస నడకలలో వయ్యారం వద్దంటే "సిరి"మువ్వ రవళించలేనంటే మురళి ..వేణుగానమే నిలిపేస్తే వీణియకు నాదమే పడదంటే మృదంగం మౌనాలనే ఆశ్రయిస్తే రవి ప్రకాశమే నిలిపేస్తే శశి వెలుగుల జిలుగులనే వదిలేస్తే మబ్బులు జల్లులనే ఆపేస్తే పవనుడు వాయు దిగ్భంధనమే కావిస్తే కుసుమాలు వికాసమే తమ వల్ల కాదంటే విత్తుకు మొలకంటేనే విసుగంటే వృక్షం ఎదగడమే దండగనుకుంటే వసంతమే పూలపరిమళాన్ని నిరాదరిస్తే లతలకు అల్లికలే అలుపు తెప్పిస్తే వాగులు ప్రయాణమే ఆపేస్తామంటే పసి గువ్వల రెక్కలే అలిగితే ధరణి విరామమే కోరుకుంటే సాలీడు అల్లికల నేర్పునొదిలేస్తే గోమాత క్షీరధారలనే నిలిపేస్తే హృదయ స్పందనలు విరామమే కోరుకుంటే అమ్మ శ్రమకు, సహనానికి రాజీనామా చేసేస్తే..... మానవ జాతికి మనుగడే లేదుగా ? జీవనానికి ప్రమాణమే జారిపోదా ? జీవితానికి ప్రయాణమే ఆగిపోదా ? మనిషి జన్మకు అర్ధమే మారిపోదా ? అందుకే .... ఉత్సాహంగా బ్రతుకునే సాగనివ్వు , సంతోషాల వడిలో వాలనివ్వు , తొలకరి జల్లై దిగి రానివ్వు , వాగుల నేస్తమై నను పయనించనివ్వు .. నా ఉనికినే నువ్వు మరిస్తే, నే శ్వాసనే విడుస్తా .. నా ఊహలకే నీవు ప్రాణం పోస్తే , అనుక్షణం నీ ఛాయనై నడుస్తా ... ll సిరి వడ్డే ll 03/02/2014

by సిరి వడ్డే



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bTXgro

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి