పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, ఫిబ్రవరి 2014, సోమవారం

Kotha Anil Kumar కవిత

@ ఒంటరిగా... @ _ కొత్త అనిల్ కుమార్ నిర్మానుష్యమైన ఈ నిశ్శబ్దపు నిశీధిలో నియంతనై పాలిస్తున్న ఈ ప్రపంచం లో ఒకడు నన్ను ప్రశ్నిస్తుంటే ఒకడు సమాధానం చెప్తాడు. ఒకడు విమర్శిస్తే ... ఒకడు సమర్ధిస్తాడు . ఒకడు విసిగిస్తే...ఒకడు సంతోష పెడుతాడు. ఒకడు హింసిస్తే ... ఒకడు ఓధార్చుతడు. ఒకడు ఎవరంటే ... ఒకడు నేనే అంటాడు. ఎందుకో తెలుసా..? ఆ ఒకడు నేనే... ఆ ఇంకొకన్ని నేనే. ఈ చీకటి రాత్రి ఒంటరి చంద్రునికి జంటను నేనే. నాకు జంటనూ నేనే . ఏ జంట లేక ఒంటరిగా ఉన్నానని బాధ కంటే ., ఇంత మంది మద్యలో నేనెందుకు ఒంటరినయ్యాననే ... నా బాధ . ఈ బాధ నన్ను కలిచి వేస్తున్న రాత్రికి ఎలా సెలవు చెప్పి రేపటి ఉదయాన్ని చూడాలి ఈ నిశీధిని ఎలా విడవాలి బదులు దొరకక రేపటి భానోధయానికి ఏమని స్వాగతం పలకాలి . ఎలా స్వాగతం పలకాలి .?! తేది:2 / 2 / 2014

by Kotha Anil Kumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1abSxGm

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి