పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, ఫిబ్రవరి 2014, సోమవారం

Chand Usman కవిత

చాంద్ || ఇంతే ఇలాగే సాగిపోవాలి || ఇంతే ఇలాగే సాగిపోవాలి చిక్కగా కుమ్మరింపబడిన చీకటి తనువంతా జారుతుంటే అక్కడక్కడా రక్తం కారుచున్న చోట వెలుగుతున్న నన్ను నాకు నేనే వెన్నెలగా చెక్కుకుంటూ రాత్రిని ఈదుతూవుండాలి అస్పష్టంగా కనిపిస్తున్న మొఖంపై చిరునవ్వును తడిమి తడిమి చూసుకుంటూ అడుగడుగునా పెనవేసుకున్న బంధాలను చిక్కులు పడకుండా దారంతా జాగ్రత్తపడాలి జీవితమంటే అన్నిటికీ నవ్వడమే కాదని వెక్కి వెక్కి ఏడుస్తున్న మదిలో ఒక మూలన కన్నీరును ఆలుచిప్పలలో దాచి ముత్యాలులా మార్చుకోవాలి ప్రతీ ఉదయం నాతో నేను పోరాడుతూ నన్ను గెలిపిస్తూ నేనంటే కొన్ని హృదయాలు కలిసిన చోటు మరికొన్ని జీవితాలు గెలవాల్సిన చోటని నాకు నేర్పాలి ఇంతే ఇలాగే సాగిపోవాలి చివరికి మిగిలే ఖాళీ సమాధిలో నేను కుప్పగా మట్టిలా పోయబడిన తర్వాత ఇంకా స్పష్టంగా జీవిస్తూవుండాలి మీ చాంద్ || 01.Feb.14 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nySQi6

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి