పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Swatee Sripada కవిత

మనం (ప్రేమికుల దినం కలలు ) యుగానికో పున్నమిలా రోజంతా పరచుకునే వెన్నెల కోసం అలికిడి లేకుండా కనురెప్పల పై వాలే స్వప్న సీమనై ఎదురుచూస్తూనే ఉంటాను ద్వారానికి ఆనుకుని ధ్యానిస్తున్న రెప్పలు వాల్చని మైనపు బొమ్మనై ఎన్ని ఊహలనో సాగుచేసి పచ్చగా నవ్వులు విరజిమ్మే చెక్కిళ్ళ మధ్య ఒదిగిన ముద్ద మందారంలా వికసించే తలపులు ఎన్ని పాటల కొత్తచిగుళ్ళనో కత్తిరించి ఒంటరితనం ముంగిట్లో తోరణాల హారాలను వేలాడదీసుకు౦టూ చరణాలు చరణాలుగా ఉల్కాపాతాలై రాలుతున్న ఉద్వేగాలను ఖాళీ మనసునిండా పోగేసుకుంటూ ఏటి తరగల మీద సేదదీరే ఏకా౦తాలను కాగితప్పడవలుగా చేసి రాయభారమంపాలన్న తమిలో ....... సూదులు సూదులుగా గుచ్చుకుంటున్న నిర్లిప్తత ముళ్ళ మధ్య సూర్యుడు ఉదయించని ఈరాత్రి ఇలా కాన్వాస్ మీద సగం గీసిన చిత్రమై ఆగిపోతే నా చుట్టూ గుడికట్టుకు ఘనీభవించిన నీ మసక వెలుతురులో గూటి లోలోపలి వెచ్చదనంలో రెక్కలు రానిపిట్ట కూనలా ఒదిగిఒదిగి ముక్కున చివర కూర్చిపేర్చి అందించే ప్రేమ మొలకల గింజలు అందుకుంటూ దిక్కులు ముక్కలై శకలాలై చెల్లా చెదరై ముసిరిముసిరి ఆశలు నీడలై మబ్బులై నువ్వూ నేనూ తప్ప మరో ప్రపంచంలేని ఈ ఉదయాన లోలోన పరవశించే జీవనదుల్లా ఒకరినుండి మరొకరు విడివడుతూ పెనవేసుకు౦టూ రెండు ప్రవాహాల సంగమమై ....

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MjqWIy

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి