పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Kapila Ramkumar కవిత

|| దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి ||మాతోబెట్టుకుంటే ...|| Posted on: Wed 12 Feb 02:26:44.69881 2014 ( ప్రజాశక్తి -- దినపత్రిక ) ''మాతోబెట్టుకుంటే'' అయ్యలారా - అమ్మలారా ! మనవతా - వాదులారా ! ఇంట్లో దీపంలేదు - వంట్లో సత్తవలేదు చాలీ చాలని వేతనం - సాగదాయే కాపురం వేతనాలు చిన్నవాయే - వెతలేమో పెద్దవాయే ఆధారంలేనోళ్ళం - గుదిబండ జీవితం కుప్పబడ్డ కంపునంత - కంపోష్టులకు తరలించే డంపింగు యార్డుల్లో - టెంపరరీ ఉద్యోగులం నీవిచ్చే జీతానికి - ఉల్లిగడ్డ రాదాయే ఉప్పు గూడా పిరమాయే ఇక పాలంటవ - నీళ్ళంటవ మాదరి దాపుకు - రావంట ! సంపన్నుల బిడ్డలంత - జలసాలతో కులుకుతుంటే చెత్తోళ్ళ బిడ్డలంత - చిత్తుకాగితాలైరి పలకా బలపం లేదు - పలకరించే పంతుల్లేడు సరకారు బడులల్లో - సరస్వతమ్మ నెలవేది పనిపాటులేని పెత్తందార్లకు - పది రెట్లు జీతమాయే ఊరికి బట్టిన మైల - నెత్తినమోసేవాళ్లకు పుట్టగతులు లేవాయే - పట్టెడన్నం కరువాయే సంకలో చీపురుబెట్టిన - పేరుకు సర్కారు నౌకర్లం చీపురోళ్ళం - చింపిరోళ్ళం అనుకొని మాతోబెట్టుకుంటే - ప్రభుత్వాలే తారుమారు (మున్సిపల్‌ ఉద్యోగులకు సంఘీభావంగా ...)

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dps7Rb

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి