పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Rajkumar Bunga కవిత

ఆర్కే ||వాలెంటైన్ - ఇప్పటికి గుర్తే నాకు ఆరోజు|| ప్రియుడా ఎలా ఉన్నావు? కళ్ళముందే కదులాడుతున్నావు గాని నా కల్మషం వలన నోరుపెగిల్చి పిలువలేను తొందరపడి తాకలనిపిస్తుంది నీ ప్రసస్త్ర వస్త్రాన్ని, కాని నా మాలిన్యము వలన నీ చెంగును తాకలేను అయిన ఏదో చిన్నఆశతో అడిగేస్తున్న ప్రియుడా ఎలా ఉన్నావు? ప్రత్యేకంగా అందరు ఈ రోజున ఇవే సంకేతాలు ఎవరేవిరికో!! తెలిసో తెలియకో ప్రయత్నమో అప్రయత్నమో సందర్భమో అసందర్భమో నేను అడిగేస్తున్న ప్రియుడా ఎలా ఉన్నావు? ఎప్పుడో రెండువేల సంవత్సరాల క్రితం శిలువలో నేచేసిన పంచ గాయాలు మన ప్రేమకు గుర్తు అంటూ మరణించావు. ప్రియుడా ఎలా ఉన్నావు? రుధిరధారలతో ఎరుపెక్కిన నీ మేను ఇదిగో ఇప్పుడు నాతోపాటు ఈ లోకం పులుముకుంది అబద్ధప్రేమతో...ఓ నిజంలా!! ఇప్పటికి గుర్తే నాకు ఆరోజు రోజే కాదు క్షణ క్షణము గుండెరోదిస్తుంది....గుర్తుకొచ్చి ప్రియుడా ఎలా ఉన్నావు శిలువలో ఇంకా వ్రేలాడుతూ? ఆర్కే ||వాలెంటైన్ - ఇప్పటికి గుర్తే నాకు ఆరోజు|| 20130804/20140214

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kGCC6w

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి