పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Krishna Mani కవిత

ఉపోద్ఘాతం *********** పదాల పూతోటలో పూసిన కవితలు ఉండును తీరొక్క రంగులు కురియును పువ్వులే చినుకులై ఎత్తైన లోయలో జాలువారే కవితలు తడుపును గుండెను నిలిచిన చోటే ! ఒకసారి అడుగు పెట్టుచూడు వదలవు ఎన్నడు మమతను కదలవు పీల్చితే పరిమాలాన్ని అంతుచిక్కని ఆలోచనా కడలిలో మనిషి భావనలు మెరిసే జ్ఞాపకాలు ఆనంద భాష్పాలు కన్నీటి కెరటాలు తేలిపోదువు మనసును చేతబట్టి ! ఏనాడో అన్నాడో కవి కాదేది కవితకు అనర్హమని నీ మనసుకు తట్టే వస్తువుని కాదనక కలుపుకో కలగలిపి రాసుకో న్యానోల లోకంల న్యానోలు పుట్టించు రైటు అన్నచోట హైకూలె రాయించు పాతవి కొత్తవి కలిపి కొత్త రంగులు పూయించు! చరిత్రకు తలొంచి గత ఘనతను హత్తుకో గడిచే కాలాన తలెత్తుకొని కలబడి నిలబడు గన్నుకాక పెన్నుతో ఎదురులేరు నీకెవ్వరు జగమొంగును నీ ముందు సాహిత్యమనే నింగిలో తారగ వెలుగొందు ! కృష్ణ మణి I 14-02-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NIpiB8

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి