పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-26 కంటికి కనిపించే చాలా చిన్నవిషయాల్లోనే చాలినన్ని విశ్వరహస్యాలు దాగిఉన్నాయని నా నమ్మకం పుష్పం వికసించే క్రమంలోనే ఆ అనంతవిశ్వం వికసిస్తున్నదేమో- విత్తనం నశించి తను వృక్షంగా మళ్ళీ ఎలా ఎదుగుతుందో ప్రపంచ వినాశం కూడా అలాంటిదేనేమో... మన ఆలోచనల ప్రకారం భౌతికవిజ్ఞానం విస్తరించడం సైతం విశ్వప్రణాళికలో ఒక భాగమేనేమో.. నా ఆలోచన-నీ ఆలోచన అసలు నీది,నాదేనా...దానికి మించిన అంతర్లోకాలనుంచి ప్రవహిస్తున్న ధారావాహికలా..! ----------------------------------------------- 14-2-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gexYt8

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి