పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Ramabrahmam Varanasi కవిత

శాంతి ప్రవచనములు వారణాసి రామబ్రహ్మం 14-2-2014 కలత చెందకే మనసా! బాధ నొందకే మనసా! జనని భారతి గుండె తెగి నిరంతరముగా రుధిర ధారలు స్రవించుచున్నను అమ్మ కన్నులు ఆర్ద్రమ్ములై ఎడతెగక అశ్రువులు వర్షించుచున్నను తల్లడిల్లకే మనసా! కుదురు వీడకే మనసా! జ్ఞాన దారిద్ర్యముచే బలహీనపడిన జనుల మనసుల తిష్ట వేసి ఉన్మాదులు ఇంద్రజాలికులు నటులు ఆటగాళ్ళు సంకుచిత నాయకులు అగ్ర తాంబూలమందినను దిగులు చెందకే మనసా! వెతలు వీడవే మనసా! యంత్రమునకు బానిసై మనిషి తనను తాను నిష్ప్రయోజకునిగా మార్చుకున్నను ఆశ్చర్య పడకే మనసా! ఆరాటము వలదే మనసా! డబ్బు సంపాదించుటలు మాత్రము ధ్యేయమై తోటి మనుషుల జీవుల ప్రాణములు తృణమై అందరు పీల్చు గాలిని త్రాగు నీటిని తిను తిండిని కొందరు ప్రాణాంతకముగ కలుషితము చేయుచున్నను ఆందోళన వలదే మనసా! అలజడి చెందకే మనసా! అడ్డ దారులు త్రొక్కి పదవులు పొంది అడ్డముగా ధనము ప్రోగుచేయువారికి "చదువు" "విజ్ఞానము" "బుద్ధి" "నేర్పరితనము" దాస్యము చేయుచున్నను కలత వలదే మనసా! వ్యథ నొందకే మనసా! అరణ్యములు ఎడారులైనను ఋతువుల ఆగమనము క్రమము తప్పుచున్నను; కరువు కాటకములు వరదలు జనుల ఎన్ని ఇక్కట్ల పాలు చేసినను బెంబేలు పడకే మనసా! ధైర్యము వీడకే మనసా! పరికించు ప్రకృతిని పరితపించకు పొంది వికృతిని చూడు నెలవంక వయ్యారాలను మర్చిపో అమవస నిశలు ఆనందించు శారదరాత్రుల మర్చిపో చిత్తడి ముంచు జల్లులు; జడి వానలు వాడిన పూల సరసన గమనించు వికసింపబోవు మొగ్గలు కనవే మనసా! కలతలు వీడవే మనసా! కలరు మనుషుల దుష్టుల మించు శిష్టులు మూర్ఖుల అణచు జ్ఞానులు మృగ తత్త్వముల మచ్చిక చేయు సర్వజన శ్రేయోకాములు శాంతించు మనసా! శాంతించు ప్రియ వయస్యా!

by Ramabrahmam Varanasi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gwJ4sP

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి