పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Katta Srinivas కవిత

కట్టా శ్రీనివాస్ || వీధుల్ని నింపే వాళ్ళు ఈరోజు ప్రయాణంలో సాయంత్రం వేళ ఊరిబయట పిట్టలగుంపులలాగా ఊరిదారిలో ఆలమందలలాగా ఊరున్నదన్న చోటో అదేమిటో జనం గుంపులుగా కనిపిస్తున్నారు. హడావిడీయేం లేదు అలాగని ఖాలీగాకూడా లేరు. లోపటి వెలితిని నింపుకునేందుకో కావాలసిన ఖాళిని ఏర్పరచుకునేందుకో బడ్డికొట్లూ, టీస్టాళ్ళూ, పచారీలూ, పలకరింపులూ రోజుఒకటేలా తిరిగే జీవితానికి బోరుకొట్టకుండా, అసలా విషయమే తెలియకుండా సినిమా చర్చలూ, రాజకీయ రంగులూ బుల్లితెరబాగోతాలూ సమయం మీద చల్లుతున్నారు వాళ్ళు. నే టీతాగేందుకు ఆగినందుకు వాళ్ళను చూస్తున్నాను. చుట్టరికపు పిలుపులూ, ఆత్మీయ స్పర్శలూ అలికిడి తరంగాల్లా అక్కడక్కడే తరకలు కొడుతున్నాయి. నెత్తిమీద మోసుకొచ్చిన బరువుల్ని తలాకొంచెం పంచేస్తున్నారు. నవ్వేదయితే మతాబులా మోహాల్లో వెలుగైచిమ్ముతోంది. కన్నీటి తడయితే చుట్టుముట్టిన ఆత్మీయపు వేడికి ఆవిరవుతోంది. ‘‘ ఇకరావయ్యో, వంటయ్యింది ’’ ఎప్పటికప్పుడే రడీమేడ్ పచారి కొనే ఇల్లాలు ముచ్చట్ల మధ్యలో మహారాజుకి అలికిడి చేసింది. ‘‘ ఎంకట్రాముడు కూడా వత్తన్నాడు ఇంకో గుడ్డు ఉడకెయ్’’ ఎముకలేని నాలుకని ఆవిడపై ఎగరేసాడు. వినెళ్ళిందో, వినకుండానే వెళతాందో. విళ్ళసలు చూడాల్సిన అవసరం లేనట్లు టీకొట్టు కూర్చిలపై పట్టాదారు హక్కుల్ని కాపాడుకుంటున్నారు. అబ్బో నేనసలే బస్తీవాడిని ఇవ్వన్ని చూస్తు కూర్చున్నానేంటి. తొందరగా ఇంట్లోదూరి టీవి పెట్టుకు చూస్తూ మరో పక్క ఫేస్ బుక్ తిరగమోతెయ్యాలిగా. ఇంటికి చేరుకునేందుకు వాహనం తొందరగానే ఆ దృశ్యానికి దూరంచేస్తూ దూసుకెళ్ళేందుకు సిద్దమయ్యింది. ► http://ift.tt/1jcdpxg ► 14-02-2014

by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jcdpxg

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి