పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//కాలం చేసిన కాలం// మల్లె తీగకి నీళ్ళు పోసి పాల పూలు పూయించిన నీవేనా... మండు వేసవికి పైరు గాలి పంపి సేదతీర్చిన నీవేనా... నిశి వీధికి వెలుగు పాఠం నేర్పి తెలుగించిన నీవేనా... వర్షపు గీతానికి మట్టి వాసన బదులిచ్చిన నీవేనా... నీవేనా...ఈ పూట...నా నీవేనా గాలితో పోటీ పెట్టుకున్న రవళి నవ్వుతో ముడిపెట్టుకున్న మీనాక్షి మనసుతో మాత్రమే మాట్లాడే మాధురి ఆమె నీవేనా... ఆకాశమంత ఎదిగావనుకుంటే నేల చూపులు చూస్తూ అవనిలా మసలుతావనుకుంటే ఆకాశంతో మాట్లాడుతూ నీ ఒడిలోనో నీ గుండెల మీదో సోలి బడలిక తీరుదామనుకుంటే నీవేనా...ఈ పూట...నా నీవేనా అల్లరి మానేసిన పిల్ల అలంకారం వదిలేసిన సౌందర్య పల్లెలా పచ్చగా ఎదురొస్తుందనుకుంటే.. పసుపు కుంకుమలతో ఉప్పు మళ్ళ నీళ్ళసుడుల అంచులతో... బాగున్నారా? అన్న పలకరింపు ఇక నేనేనా...ఈ పూట...నేను నేనేనా....14.02.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eVfije

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి