పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Nirmalarani Thota కవిత

ప్రేమంటే . . . ? ? ? తను కరుగుతూ తన వారి కోసం దశ దిశలా వెలుగు పంచే క్రొవొత్తి. . త్యాగ నిరతి . . .! తను రాలుతూ పూవై..పండై.. సేద తీర్చే నీడై. . చివరికి వంట చెరుకై కాలిపోయే తరువు. . కల్పతరువు . . . ! అద్భుతమైన దాన్ని ప్రేమించడం సామాన్య విషయం. . సామాన్యమైన దాన్ని ప్రేమించడం అద్భుతమైన విషయం . .! అందమైన గులాబీని అందరూ ప్రేమిస్తారు . . . అతి మామూలు ఆకును ప్రేమించడం . . ? గుచ్చుకునే ముల్లును ప్రేమించడం . . .? అద్భుతమైన విషయం కదూ. . ! ఆకులో అందాన్ని కాక ఆయుష్షు పోసే అత్మీయతనూ . . . ముల్లులో గుచ్చే గుణాన్ని కాక కంచై కాపాడే అంగరక్షణనూ. . ప్రేమించగలగడం అద్భుతమైన విషయం. . .! ఎర్ర గులాబీల్లో కాదు ఎద లోతుల్లో చూడు . . స్వచ్చమైన ప్రేమను . . ! ఒక్క రోజు బహుమతి ఇవ్వడంలో కాదు . . బ్రతుకంతా ఒక్కటిగా ఉండడంలో చూపు అంతులేని ప్రేమను. . . ! "ప్రేమ" అవసరాలకూ అసూయకు, స్వార్ధానికి అతీతమైన ఒక అలౌకికమైన అనుభూతి . . ! ఆకర్షణకూ . . . తుచ్చ వాంఛలకూ . . వెర్రి తలలు వేసే పాశ్చాత్యపు పోకడల మోజుకూ . . "ప్రేమ" అనే పవిత్ర పదాన్ని కలుషితం చేయకు . . .! ప్రేమకు అర్ధాన్ని కనుమరుగు చేయకు . . ! నిర్మలారాణి తోట [ 14.02.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1drHYib

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి