పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, మార్చి 2014, బుధవారం

Thilak Bommaraju కవిత

తిలక్/­ తెలియని నిర్మాణం -------------------­-- ఈ ఉదయపు నీరెండలో కొన్ని పచ్చని కాంతులేవొ చెట్ల కొమ్మల గుండా ప్రసరిస్తూ వాటి ఆకులపై సున్నితంగా కూర్చున్నాయి అప్పుడే కళ్ళు తెరిచిన కొన్ని పిచ్చుకలు గూటి కిటికిలోనుండి తల బయటకు పెట్టి కంటున్నాయి అప్పటిదాకా కనని కొత్త లోకాన్ని ఇసుకరేణువుల్లాంటి వాటి కనుపాపల్లో ఎన్ని ఆశలో రోజూ కొత్తగా ఎగరాలని కొన్ని రోజులను వాటి రెక్కలకింద పాతేసుకుంటూ వాలిపోతుంటాయి మబ్బుల తెరచాపల కిందుగా ఊళ్ళు దాటి వనాలను వయ్యారంగా పరికిస్తూ కొత్త రంగులను ఏరోజుకారోజు అద్దుకుంటూ అన్వేషణ పగిలిన బాణాలు కొన్ని గుచ్చుకోని గులాబి రెక్కలుగా చేరినప్పుడు మంచు హృదయాలను మళ్ళా కొన్నిసార్లు విదిలించుకుంటూ చేరిపోతుంటాయి చిరునామా తెలియని తీరాలకు పిలవని చుట్టంలా... మళ్ళా ఇప్పుడొక కొత్త గూటిని కట్టుకోవాలి రాలిపడకుండా... తిలక్ బొమ్మరాజు 12.03.14

by Thilak Bommarajufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1njiPfN

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి