పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, మార్చి 2014, బుధవారం

Sivaramakrishna Valluru కవిత

నీలోకి...! ।। వల్లరి ॥ ----------- ---------------------- ఎడారిలో నీటి చెట్టు దాహార్తిని తీర్చినట్టు గొంతు దాటి నీటి బొట్లు జారి పడుతున్న భ్రాంతి.... తడారిన గుండె తల్లడిల్లే వేళ తన్మయత్వంతో నీలోకి తొంగి చూసిన భ్రాంతి.. అల్లంత దూరాన ఆకాశ దీపమై అనుక్షణం దేహాన్ని తడుముతున్న భ్రాంతి.... ఒక్కొక్క జ్ఞాపకం వదిలి వెళ్ళిన సంతకమై ఓదార్చుతున్న భ్రాంతి... తెలవారని రేయిలో తోలిచుక్కవై నీవు తోలకరిస్తావని భ్రాంతి.. ! ----------------------- - వల్లరి. -12-03-2014. ------------------

by Sivaramakrishna Vallurufrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nMVXCd

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి