పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, మార్చి 2014, బుధవారం

Naresh Kumar కవిత

సొన్నాయిల నరేష్కుమార్ //చివరికి ఏం పీకాం?// బతికేందుకు ఇంకా ఏం చేయగలం బతకటం తప్ప వేలి చివర వెలుతురులతికించుకొని జీతమిచ్చే జీవితం తో వేటాడబడుతూనే ఉంటాం గుడిమెట్లదగ్గర రూపాయ్ కో రెండ్రూపాయలకో పుణ్యం కొనేస్కున్నాక పాదాలని భుజాలపై ఉంచి తిరుగుతూనే ఉంటాం ఇక్కడెవరూ బతికించలేరు బతకనిస్తారంతే వెన్నెల రాత్రులూ, చల్లని గాలులూ,ఆకలి కోరికలూ మొదలగు సుందర దృశ్యాల్లేని కళ్లతో ఖాలీ గ్లాసుల్లా ఒక్కొక్కడూ తమతమ టేబుళ్ళపై కదలికల్లేక ప్రాణం లేని దేహంలా కదులుతూంటారు ఎక్కడా ఉండని ముద్దుల్లో చక్కెర శాతాలూ కౌగిళ్ళ స్వాంతనలూ, మనుషుల మద్య ప్రేమలూ, దేవుడి కరుణా కటాక్ష వీక్షణల కోసం వెతికీ...,వెతికీ..., తీరా చివరికి అవన్నీ శూణ్యాలని తెలుసుకొనీ బట్టతలల్తో దువ్వెన చేతిలో పట్టుకొని తమ సమాధి పై కూర్చుని పొగిలి పొగిలి ఏడ్చే మనుషులని చూస్తూ మనమూ కదుల్దామనే అనుకుంటాం చిత్రంగా అప్పటికే మనలని దారాలతో భందించిన సాలె పురుగొకటి మనవైపే పరుగెత్తుకొస్తూంటుంది.... బతికున్న శవపు జీవితానికి నామ సార్ధకత లభించాక.. అప్పుడరుస్తాడు కాట్లో కాటమ రాజు గంజాయి దమ్ము లాగుతూ,తోలు గోచీ లోంచి పృష్టాన్ని గోక్కుంటూ, నాగు పాము కళ్లతో నవ్వుతూ "చిచ్చా అబ్ ఖేల్ ఖతం దుక్నం బంద్ వచ్చి నీ సమాధిలో పడుకో నేన్నీకు విశ్రాంతినిస్తాను...." అని 12/03/14

by Naresh Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cPPaqh

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి