పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, మార్చి 2014, బుధవారం

Annavaram Devender కవిత

తొవ్వ ...............అన్నవరం దేవేందర్ 12.03.2014 మొస మర్రనియ్యని మురిపాలు ,వశం గాని సంబురాలు వశం గాని వాన పడుతే ఎట్లుంటదో మనకేరుకే .వశం గాని మురిపాలు అంతే ,పట్ట వశం గాని ఆనందాలు అంతే .ఎగిలివారంగ అయిదు గొట్టంగ మొదలైన ఫోన్లు రాత్రి పదకొండుకు బంజేత్తే బందు అయినయి.పొద్దుగాల ఎనిమిదింటికి ఇంటికి రాక పోకలు మొదలైనయి.ఇటు మనుసులు అటు ఫోనులు అబ్బబ్బ ....అన్నం తినుడు అవుతలి ఇవుతలికి పోవుడు ఏడ .....మంది ఎనుక మంది ఫోనుల ఎనుక ఫోను ...అయితే కొన్ని వందల ఫోన్లు వశం గాక ఎత్తలే ..అన్ని మిస్సుడ్ కాల్స్ అయ్యి ఉంటయి ... ఇదంతా నిన్న కరీంనగర్ లో డాక్టర్ నలిమెల భాస్కర్ ఇంట్ల జరిగింది .ఆయనకు కేంద్ర సాహిత్య ఎకాడమి అనువాద లో పురస్కారం ప్రకటించింది .దీంతో ఈ శుభాకాంక్షల వాన పడ్డది .తను మలయాళం నుంచి 'స్మారక శిలలు ' నవల ను అనువదించిండ్రు .ఈ పురస్కారం ఏమో గని మిత్రుల ,బందువుల ఆత్మీయత తోని ఉక్కిరి బిక్కిరి అయిన దేవేందర్ అని అన్నడు .నలిమెల భాస్కర్ గురించి ఇదే కాలం ల ఒకసారి రాసిన .దానిని మల్లోసారి సదువొచ్చు.అది దొరుకక పోతే నా 'పెద్దర్వాజ '(http://ift.tt/1lyyNOh) ల సూడొచ్చు .ఎకాఎకిన భాస్కర్ సార్ మీద Narayana Sharma Mallavajjala .Ramakrishna Kalvakunta ,Boorla Venkateshwarlu కవిత్వం వర్షమే కురిపించిండ్రు .అవ్వి సుత ఇస్తున్న ..... 1. ఏ మట్టి పొత్తిళ్ల నుంచి ఈ ఙ్ఞానం నడక నేర్చిందో ఈ పాలపిట్ట ప్రపంచగొంతుకని పాటకట్టి ప్రసారం చేస్తుంది ఏ వాగుగిన్నెల అమృతాన్ని పులుముకుందో దెశపు నాలుగుచెరగుల మట్టివాసనకి దోసిలి పట్టింది పదునాల్గుభాషలు ఒక్కపుస్తకమైనడిచినట్టు పదిభాషలు ఒక రామచిలుకల గుంపై ఊరేగినట్టు పదిదిక్కుల ఉద్వేగాలు ఒక గుండెగా కొట్టుకున్నట్టు ఈ గొంతుకొక్కటే దేశానికి నిలువుటద్దమౌతుంది అనేక భాషల పిల్లవాయువులు అక్కడక్కడి సరస్సుల శీతల సమీరాలు ఆయా ఉద్యమాలవెలుగురేఖలు ఈ కిటికీ నుంచేమమ్మల్ని చేరుతాయి కాగితాలకి కళ్లతికించుకున్న బుద్ధుడిచేతిలో ఏ గొంతులూ మాగడపలో మూగ బోకుండా భోధి వృక్షాలౌతాయి ---------యం.నారాయణ శర్మ .11/03/2014 2. పద్నాలుగు భాషలభాస్కరుడు నారాయణపురం మట్టిపువ్వు తనహృదయకోశాన్నిజల్లెడపట్టి జానుతెనుగుసొగసు తెలంగాణా పదాల్నిఏరి కుప్పవోసి,కడుపులున్నమాటల్ని అక్షరబాణాలుగా ఆలోచనల్ని ఎక్కుపెట్టి మౌనంగా మహాకార్యాలు చేసేమొండి పట్టుదలకు పర్యాయ పదం రక్తమాంసాల నిండా నాయిన రామచంద్రం సారుని తనలోకి వొంపుకున్న మట్టి బిడ్డ స్వరాల్ని శ్రుతి కలిపి గుండె పియోనోపై ఆత్మీయతల్నివర్షించే ఆక్షర భాస్కరుడు దివారాత్రాలు కండ్లను పుస్తకాల పుటల్లో మాగవెట్టి ,కథల పండ్లనురసపరిపుష్టం చేసినోడు తెలుగు మట్టిపొత్తిళ్లల్ల అనువాదపు కొత్త పంటలు పండిస్తున్న నిత్యకృషీవలుడు ఆనువాదపునవనీతం నలిమెల భాస్కరుడా! నజరానా అందుకో! నాలుగుకోట్ల తెలంగాణా జనం సాక్షిగా!! ..............కలువకుంట్ల రామ కృష్ణ .11/03/2014 3. ముసి ముసి నవ్వుల ముత్యాలు రాలిపడే కళగల్ల మొకం పత్తిపాన్పులకెల్లి బొర్లచ్చినట్టు గుండెలకెల్లి పలికే రామసక్కని మాట మీగడ పెర్గు గిలకొడితె పేరుకున్న నవనీతం మనుసు అక్షరమక్షరం కండ్లకద్దుకుంటడు ఆత్మగల్ల భాషేదైనా అర్థం జేసుకుంటడు అతని పేరు నలిమెల భాస్కర్ అదిప్పుడు తెలుగు భాషల ముత్యాల పేరు పేరీ పేరీ అట్టుగట్టిన భాషల పరమాన్నం తెలంగాణ కడుపు సల్లగ జేసిన పదకోశపు సల్లకుండ ఒక్కటే తొవ్వ ఒక్కటే పట్టు మాటమీద నెనరు మనిషిమీద పావురం పనిమీదేసుకుంటే పరమాత్మనైనా పక్కకు పెట్టుడే పదామడైనా పాదాల పదాలు సుట్టుడే మానేరు పదనంత కరెక్కినట్టు దినదినం గల్లర గల్లర ఉరుకుడే బొళ్ళర బొళ్ళర కురుసుడే కుల్లంకుల్లం జేసుడే ఆ కాళ్ళకింది మట్టిని ముట్టుకుంటే సాలు ప్రపంచమంతా అనువాదమైతది అజ్ఞానమంతా సాగిలబడి సల్లు సల్లైతది. ...........బూర్ల వెంకటేశ్వర్లు 11/03/2014

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cw2S0T

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి