పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

12, మార్చి 2014, బుధవారం

సుధ కొనకళ్ళ కవిత

మా ఊరు బడి దగ్గర హేచ్చురామయ్య తాత బడ్డి కొట్టు బూబమ్మ అత్త సెంటరులో మిషను మామయ్య పుల్ల ఐసు హుస్సేన్ అన్న మేమంతా ఓ కుటుంబంలా ఇపుడా పిలుపుల జాడే లేదు మా వూరి మల్లెపూల వాగులో అల్లి పళ్ళ జాడ ఏది ? చింతల వాగులో దెయ్యాల కధలు వాటి తాలుకు భయం జాడలు మాత్రం ఇంకా ఉన్నాయి సుమీ దొరగారి దివాణం లో ఉసిరికాయ రుచి ఇంకా మరవలేదు కనకమ్మ అత్త పెంకుటిల్లు మాత్రమే మా ఊరి అతిధి ఉద్యోగస్తులకు పెద్ద వైట్ హౌస్ లాంటిది మా ఇంటి ముందర చేతి పంపు అక్కడే పెద్దవాళ్ళ ముచ్చట్లు కన్నెపిల్లల వయ్యారాలు నీళ్ళ వంతు వచ్చిన కావలసిన వాడి రాక కోసం కళ్ళలో ప్రాణంగా ఎదురు చూపులు బిందె నడుముపై వయ్యారంగా అసలా దృశ్యం ఎంత మనోహరం ప్రేమ కోసం తొట్టిలో నీళ్ళు పారబోసి మల్లి నీళ్ళు తేస్తున్నాడని తిట్టుకుంటూ తిరిగే సూరమ్మ అత్త చాకలి అప్పయ్య ఇంటి ముందర ఎంత పెద్ద దోర అయిన వరుస కట్టవలసిందే సీతాఫలాల అమ్మె చిట్టెమ్మ ఇంటింట నవ్వులే పుయించేది లైసేన్న్సు కూలి బోడయ్య తాత వస్తే పిల్లలకు ఎంత సంబరమో దొరగారు రోడ్డు పై వెళుతా ఉంటె వంగి వంగి దణ్ణాలు ఇపుడా దొరా లేదు దోర తనము లేదు బ్యాండు మేళం బోగాలు లేని పెళ్ళే లేదు మా ఉళ్ళో డప్పు అప్పన్న లేకుండా పంచాయితి వార్తే లేదు మరి ఇప్పుడు మా ఉళ్ళో వంతెనపై అంచు పంచెతో నాన్న లేరు ఆ పిలుపులు లేవు టివి సీరియళ్ళలో పడి మమతలే మాయం పట్నం మోజులో పూల జడలు కాదు కదా జడల జాడలె లేవు అంకమ్మ తిరునాళ్ళలో పూనకం వచ్చిన వాళ్ళలా విరబోసుకుని తిరుగుతున్నారు పరికిణి ఒణిలు లేవు అంత మాయం కాని నేను నా జ్ఞాపకాలు మాత్రం ఇంకా పదిలం $ సుధ కొనకళ్ళ $ 12.03.14

by సుధ కొనకళ్ళ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fsa7GN

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి