పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మార్చి 2014, శనివారం

Swatee Sripada కవిత

కాసీపు ................ ఎక్కడి నుండో ఓ చల్లని పలకరింత ముసురుపట్టిన ఊహల చుట్టూ ఓ గాలి వీవనలా రెపరెప లాడినప్పుడు ఆపినా ఆగలేని శ్రావణ మేఘాన్నవుతాను లోలోని ఆకాశానికీ బయటి నేలకూ వంతెనలు వేసే నీటిధారలై తలపులు వరదలై వాగులై ముంచెత్తే వేళ మౌనం దారంతా పరచుకుని ఇంకా విచ్చుకోని నిద్రగన్నేరు స్వప్నంలా ముకుళించుకున్న రాగాలమధ్య తడబాటు వాయులీనాన్నవుతాను కొమ్మకొమ్మనా వసంత౦ తొలి సారి చూలి౦తై సిగ్గులు పొటమరించిన వేళ ఎప్పుడో జీవన ప్రా౦గణాన సుతిమెత్తని అడుగులసడి సరిగమల అలికిడి సాయంత్రపు సంధ్యవేళ ముసిరే మల్లెల పరిమళమై ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. క్షణం పాటు నన్ను నేను మరచి నాగస్వర వశీకరణలో నీ నీడ నీటిపొరలో ఓడి ఒదిగిపోతాను శీతల పవనాల హేమంతాన్ని తలకు చుట్టుకుని జబ్బుపడ్డమనసుకు ఊరటనివ్వాలనుకున్నా మూసిన కనురెప్పల మధ్య విస్ఫోటి౦చె అగ్ని పర్వతాలు ఆగి ఆగి తలపులనూ తలుపులనూ తట్టే కూనిరాగాలు బీడువారిన రోజులను సాగుచేసుకు హరిత వనాలు నాటి నాటి ఆనెలు మొలచిన అరచేతులు అలసిసొలసి సొమ్మసిల్లినా వివశామైన క్షణాల్లో కాలం దోచుకున్న దోపిడిలో మిగిలినవి రిక్తహస్తాలూ ఎండి తడారిన కంటి చూపులూ నన్నిలా కాస్సేపు ఈ అనుతాపాల మధ్య మేను వాల్చనీ ఖాళీగా మారిన నా చిరునవ్వుల పొదలకు చిరుమొగ్గలు అతికించుకోవాలి. మాటలు మర్చిపోయిన నా ఊసులకు అక్షరాలూ దిద్ది౦చాలి

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gn2SeG

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి