పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మార్చి 2014, శనివారం

Mehdi Ali కవిత

!! ఎన్నాళయింది నాన్న? ... !! ఎన్నాళయింది నాన్న నాతొ మనస్ఫూర్తిగా మాట్లాడక ... నిజానికి నువ్వేం మాట్లాడుతావని ... నా దగ్గరికి నువ్వు రావు నీ ప్రపంచం లోకి నేనొస్తె ఏరా బాగ చదువుతున్నావా ..తప్పా నువ్వేం మాట్లాడుతావని ... ఉదయం లేచినప్పటి నుండి రాత్రి .. అది కూడ ఏ రాత్రి నిద్రపోతావొ ..... ఇంటర్నెట్టె నీ ప్రపంచం ఉదయం రాత్రి మధ్యలొ నువ్వు ఆఫీస్ కు వెల్లిపొతావు నెను స్కూల్ కు వెల్లిపొతాను అమ్మ , నువ్వు నేను కలసిఉండే కొద్ది సమయం నీదేమో నీ ప్రపంచం నిన్ను ఏమనలేక అమ్మాదో టీవీ ప్రపంచం మీ ఇద్దరికి చెప్పలేని నా చిన్ని ప్రాయానిదో ఫ్రపంచం మనందరి మధ్యలొ కొన్ని యాంత్రిక పలుకరింపులు మనం అపరిచితులమా నాన్నా ? ఇంతకు ముందు ఏలా ఉండే వాళ్ళం !? ఉదయాన్నే నాకు అన్నీ బొధించే వాడివి చదువులో అవి నన్ను ముందుకు నడిపించేవి సాయింత్రాలు నన్ను తీసుకొని షికార్లకు వెళ్ళేవాడివి నన్ను తీసుకెళ్ళడం కాదు ... నువ్వే కంప్యూటర్ వదలవు ఇంటికి బంధువులు వస్తే ముళ్ళపై కూర్చున్నట్టూ ప్రవర్తిస్తావు వాళ్ళెప్పుడు వెళ్ళిపొతారాని చుస్తావు ఇదేనా నాన్న జీవితం ? ఇదేనా నీ ప్రపంచము ? నీ పరిఘ్ణానం పెంచుకో .. మాక్కాస్తా సమయం ఇచ్హి మాతో కూడా కాస్త ప్రేమను పంచుకో నీకు చెప్పే ప్రాయం నాది కాకపొవచ్హు నెట్ పై చెతులతో ప్రపంచాన్ని ముందుకు తెచ్హుకుంటావే ఆవే చేతులతో అప్పుడప్పుడు నా శిరస్సు ను కూడ నిమురు నాన్న.. 15 -03 14 ( konni akshara doshaalaku kshamaapanalu )

by Mehdi Ali



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nsqiZW

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి