పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మార్చి 2014, శనివారం

John Hyde Kanumuri కవిత

?? //జాన్ హైడ్ కనుమూరి// ---- మోహించేది రాక్షసే కావచ్చు ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడే వెనుకెనుక ఓ యుద్దానికి వ్యూహ రచన జరుగుతుంది మోహించేది రాణికూడా కావచ్చు తిరస్కరింపబడిన బిగికౌగిలి చెఱశాల పాల్చేస్తుంది లొంగని గుణశీలత యోసేపుదే చెఱశాలనుండి ప్రధానపదవికి వ్యూహ రచన జరుగుతుంది *** రకరకాల మోహాలు, సన్మోహాలు మధ్య లక్ష్మణుణ్ణి యోసేపులను గుర్తించడమెలా!! *** ప్రతీకలన్నీ ప్రక్కకుతోసి ప్రధానపదవికోసం ముక్కుచెవులుకాదు ఎవరి గొంతైనా కోద్దాం ఎవరు ఎవరినైనా మోహించి శయనమందిర పరదాలన్నీ చించేద్దాం!! వంగివంగి మోసే దేహాలపై బాహాటంగానే శయనిద్దాం *** కాపాడాల్సింది ప్రధాన పదవొక్కటే!!!!!! పొందాల్సిందీ ప్రధాన పదవొక్కటే!!!!!! .........................................15.3.2014

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fIh6eZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి