పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మార్చి 2014, శనివారం

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || మనస్సాక్షి|| +++++++++++++++++++++ నా అచేతన స్థితిని మేల్కొల్పితే ఎన్ని నిజాలు బయటకోస్తాయో అందుకే నిజాలుకు నివురు గప్పి చేతనంలోనే ఉండిపోతున్నాను చూసిన సాక్ష్యాలన్నీ రెటీనా లోనే దాచేస్తున్నా ఏదో రోజు కనుపాపలో నిన్ను చూడాలని నా కళ్ళల్లో దాచేసుకోవాలని రెప్పలు తెరిచే ఉంచా చిన్నమెదడులో సగ భాగం నిద్రపుచ్చా గాయాలన్నీ దాచేసుకోవాలని దాగని గాయాలు మాత్రం పెద్ద మెదడును గెలికేస్తున్నాయి అందుకే నిద్రాణ స్థితిలో ఉండిపోతున్నా చేతన అచేతన స్థితుల మధ్య కొట్టు మిట్టాడుతున్నా అర్ధం కాని లాజికల్ సైకాలజీ మనసును తొలిచేస్తుంది నివురు పోతుంది నిజం నిప్పై కనపడుతుంది గుండె గాయాలు గుచ్చుకుంటున్నాయి మనసు మాత్రం నిదుర పోతుంది ఎప్పటికి లేవకుండా సాక్ష్యాలును సజీవ సమాధి చేస్తూ నేను చేతనం గా ఉండిపోతున్నా =================== మార్చి 15/2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fHE2em

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి