పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మార్చి 2014, శనివారం

Garige Rajesh కవిత

అర్థంలేని అక్షరం..... ప్రేమను పొందే అదృష్టం లేనప్పుడు కన్నీళ్ళను అనుభవించే వరమే అందుతుంది మేఘం వర్షించినంత సులభంగా నేను నీ ముందు నా భావాల్ని చెప్పలేకపోయా అందుకే రాత్రిలోని బాటలా మారిపోయా నిన్ను ఆకాశంలోని తారల ఊహించుకోలేదు నా గుండెలోని స్పందనగా నిలుపుకున్నాను నిన్ను స్వర్గంలోని దేవకన్యలా కలగనలేదు నన్ను నడిపే శక్తిగా మలుచుకున్నాను నవ్వులోని అందం అందరికి తెలుసు కాని ఆ నవ్వువెనక ఉన్న కారణం ఎందరికి తెలుసు రాత్రుళ్ళు నిన్ను తలుచుకొని విలపించాను కన్నీళ్ళను కవిత్వంగా మలిచి ఆలాపించాను ఎక్కడైన నిన్ను తలుచుకోవడమే ప్రేమనుకున్న ఎప్పుడైన నీతో ఉండడమే జీవించడమనుకున్న కాని ఇప్పుడు తెలిసింది ప్రేమంటే జ్ఞాపకమని జీవించడమంటే గాయంగా రగలడమని నీపేరు నాపేరు కలిపి రాసుకొని మురిసేవాన్ని నీ రూపాన్ని తలుచుకొని నవ్వేవాన్ని అక్షరాలు కలిసినంత సులువుగా మనుసులు కలవవు కదా ఆలోచనలు అందినంత వేగంగా ఆప్యాయతలు అందవు కదా అందుకే నేనిప్పుడు చెదిరిన కలల కారాగారాన్ని చెట్లు మాన్పుకున్నంత త్వరగా నా మనుసు గాయం మాన్పుకుంటుందా?? సంద్రం దాచుకున్నంతగా నా హృదయం బాధల్ని దాచుకుంటుందా?? వేకువనో, రాత్రో అయితే బాగుండేది నా కాలం సాయంత్రంలా మారింది ఎటు కాకుండా పగిలిన మది పెంకులు గుచ్చుకొని నా రక్తం స్రవిస్తున్న నీ ప్రేమ తరగడం లేదు నా ఒంటరి తనాన్ని తలుచుకొని కన్నులు ప్రవహిస్తున్న నీ రూపం తొలగడం లేదు నువ్వెలాగు లెవ్వు మరికెందుకు ఈ కన్నీరు, ఈ కవిత్వం నీతోనే వచ్చాయి కాని నీతోనే పోలేదే..?? నేనింక మనిషినని, వేదన నిండిన మనుసునని గుర్తుతెస్తున్నాయి నువ్వెళ్ళిపోయావు అయినా నీ అడుగుజాడలు నాగుండెల్లోనే నిలిచున్నాయి నువ్వు దూరమయ్యావు అయినా నీ జ్ఞాపకాలు నాలోనే కొలువున్నాయి వసంతంలేని ప్రకృతిలా నా జీవితమిప్పుడు అంద విహీనం దేవతలేని గుడిలా నా మానసం ఇప్పుడు శోకాయమానం అర్థంలేని అక్షరంలా నేనిప్పుడు శూన్యం

by Garige Rajesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Of5BB1

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి