పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మార్చి 2014, శనివారం

Sriarunam Rao కవిత

సామాన్యుని మనసే...పవనిజం. ఆశలవిత్తనాలు మొలకెత్తించిన ఆశయాలమొక్కలు నిరంతరంగా పుడుతూనేవుంటాయి, కొందరు...వాటిని పిచ్చిమొక్కలనుకుంటారు,కానీ... చెదిరిన నమ్మకాలూ... నాశనమవుతున్న నిజాలూ... వంచిస్తున్న నాయకత్వాలబారినపడిన హృదయాలుకొన్ని... ఆ మొక్కలచిగుళ్ళతో కలిసిపోతూ తమ జీవితాలకు నీడనిచ్చే మహావృక్షాన్ని నిలబెట్టుకుంటాయి. జాతుల గొంతుకలు కోస్తున్న ఘాతుకాలన్నిటినీ ఇన్నాళ్ళూ మౌనంగాభరించిన మేఘాలు...చేరి పిడుగులశబ్దాన్ని సృష్టించే శంఖాన్ని సిద్దంచేస్తున్నాయి ఒంటరితనంలో ఉదయించే ఆక్రోశమే... ఓర్పుకీ ఆవేశానికీ అర్ధవంతమైన సంబంధాన్ని నిర్వచిస్తుంది సామాన్యుని గుండెకోత తెలుగువాడి హృదయపు వ్యధ వంచించిన మానవత్వం భారతీయిని భవిష్యత్ కోణం ఇవన్నీ కలగలిసినదే పవనిజం, అది "హీరోయిజంకాదు...కామన్ మాన్ నైజం" అంటున్న జనసేన నిజమైన నవ్యప్రపంచానికి ప్లాట్ ఫాం ఇక బయలుదేరండి... మార్పుకోసం మనందరికోసం మనిషి మనిషికాబ్రతకాల్సిన తీరంవైపుకి. శ్రీఅరుణం విశాఖపట్నం

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fHE1XA

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి