పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, మార్చి 2014, శనివారం

Surya Prakash Sharma Perepa కవిత

వేదాధ్యయ //08-03-14// గుండె. ఎన్ని జన్మల రుణమో సఖీ... నా గుండెలో ప్రేమ గది పునాది పడింది. నీ పరిచయానికి ముందు కీటకాలుగా కనబడినవన్నీ నా ప్రణయ వృక్షంపై వాలిన తుమ్మెదలుగా కనిపిస్తున్నాయిప్పుడు రక్తం తాగే జలగలుగా కనిపించినవన్నీ మకరందం తాగే భ్రమరాలై సంగీతం వినిపిస్తున్నాయి. గదితో మొదలైన నా ప్రణయ సౌధం నా హృదయ దేవతకై వేల గదుల సామ్రాజ్యాన్నే కట్టింది. ప్రతి గదిలో...ప్రతి మూలలో... ప్రతి ఇటుకపైనా నీ పేరే రాసుకుని కనబడిన ప్రతి గుండెలోని ప్రేమనూ ఆస్వాదించింది. విషతుల్యమైన ద్వేషాన్ని ప్రేమ అనే అమృతంగా మార్చి మరొక గదికి పునాదిగా మార్చగిలిగింది. నిర్మాణం పూర్తయింది. నీ మూర్తిని అందులో ప్రాణ ప్రతిష్ఠ చేయాల్సిన తరుణంలో భూకంపాన్ని సృష్టించావు. ప్రళయమే అయావు... లక్ష గదుల నీహృదయంలో ఒక్క గది కూడా ఖాళీ లేదన్నావు. నాకోసం ద్వేషం అనే విషం కూడిన గుండె కట్టావా ప్రాణేశ్వరీ!! ఆ విషాన్ని బొట్టు పొల్లు పోకుండా అందుకుని అనంతమైన అమృతాన్ని నీ గుండెకు ఇచ్చే ప్రేమ నా గుండె సొంతం. నువ్విచ్చిన అమృతమే కదా చెలీ... నీ విషాన్ని అమృతంగా మార్చగల శక్తి దానికుంది. -ఎక్కడుందో...ఏంచేస్తోందో... పుట్టిందో పోయిందో తెలియని అజ్ఞాత ప్రేయసికి అంకితం :D

by Surya Prakash Sharma Perepa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n36Frj

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి