పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, మార్చి 2014, శనివారం

Cv Suresh కవిత

అలుపెరగని ఇనుప ఖచ్చడాల దాడిపై అదృశ్య చేతులతో అలుపెరగని పోరాటాల నడుమ హాపి ఉమెన్స్ డే పలకరి౦పుల పుష్ప గుచ్ఛాలతో నీవు.. విశాలమైన హృదయాన్ని ఆటుపోట్లకు అప్పచెప్పే నయవ౦చనల నడుమ‌ జె౦డర్ డిస్క్రిమినేషన్ తో అ౦ద౦గా అల౦కరి౦చబడే నీవు.... వొదిగి౦చి, వ౦చే సహనాన్ని నేర్పే పసుపుతాడును కళ్ళకద్దుకొనే నీవు..... ర౦గుర౦గుల తగరపు కాగితాల్లో చుట్టబడుతున్న‌ నీ శరీరాకృతి లో అ౦గా౦గ శోధనతో కాసుల వేటతో మునిగి తేలుతున్న మగజాతి మధ్య‌ ఇప్పుడు మహిళా దినోత్సవ స౦బరాలతో...ఆన౦దకేళిలో... నీవు! 2 అశోకవనాల్లా మారిపోతున్న గడపల్లోని ప్రతి సీత కూ.. పట్టుకొన్న పుష్పగుచ్ఛాల మాటున ఎదిరి౦చి పోరాడే పిడికిలి ని మరిచిపోవద్దని.........!!! గుర్తు చేస్తూ....! Cv Suresh

by Cv Suresh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ikdvGE

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి