పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, మార్చి 2014, శనివారం

Chi Chi కవిత

_ 0 _ అలా,ఇలా,ఎలాగోలా కాయం కదలికల కారణాలాపుతాయప్పుడప్పుడు కడుప్పిలిచేదాకా ఆగెతుకుతూ పడే ఆత్రంలో కనిపించదేదీ!! ఆత్మనే అజ్ఞానం దగ్గరాగి , అదే జ్ఞానమనే ఆకలి చప్పుళ్ళకు బెదిరి కదలికలాగవు!! ఆత్మాజ్ఞానాన్ని దాటిపోతే ఆగిపోతావేమో ప్రాణం నిండిన రాయిలా చిరాయువుతో ఆకలి చచ్చి మిగిలిపోతావేమో!! అయినా ఆకలి మాత్రమే చస్తే చచ్చేదేముంది దేహసందేహాలాకలి ఉసిగొల్పే చలనం చావాలి రాయి బతకాలంటే!! చలనం చచ్చాకేమవుతుందో ఆలోచిస్తే చలనం చావనట్టే ఆలోచన చచ్చి అచలమై చేసేదేముందో దేహం తప్ప అన్నీ చచ్చాకే తెలుస్తుందేమో అసలదే బతుకంటే అనిపిస్తుంది ఆకలి బతికున్నప్పుడు!! అంతా అయ్యాక అంతరించకుండా నిర్మితమయ్యే సంకల్పమేదో మూలమార్గాన పొంచి ప్రతి కదలికనూ పరీక్షిస్తోంది నిత్యకృత్యంగా!! అంతే నిశితంగా అజ్ఞానం కూడా ఆకలి వైపుకు అడుగులేయిస్తోంది!! రెండు వైపులా కదులుతూ ఏ చివరకూ చేరలేక ఆగాగి ఆలోచనాపుకోలేక , సాగుతూ ఆకలితో వేగలేక అటుసారమిటుసారమంతా నిస్సారమవుతుంటే కదలికాగిపోయింది!!________________________Chi Chi (8/3/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fewSsZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి